...
...
Next Story

దేశ భక్తిని రగిలించేలా పవర్‌ఫుల్‌గా భగ భగ సాంగ్ రిలీజ్- రెహమాన్ రాసిన లిరిక్స్‌తో చైనా పీస్ కొత్త పాట

తెలుగులో యూనిక్ స్పై డ్రామాగా వస్తున్న సినిమా చైనా పీస్. చైల్డ్ ఆర్టిస్ట్ నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్‌లు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా చైనా పీస్ సినిమా నుంచి దేశ భక్తిని రగిలించేలా భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతోంది.

Published on: Jan 23, 2026, 09:50:13 IST
Advertisement

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన లేటేస్ట్ తెలుగు యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. ఈ సినిమాకు అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన చైనా పీస్ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

యూనిక్ కాన్సెప్ట్

దేశ భక్తిని రగిలించేలా పవర్‌ఫుల్‌గా భగ భగ సాంగ్ రిలీజ్- రెహమాన్ రాసిన లిరిక్స్‌తో చైనా పీస్ కొత్త పాట
దేశ భక్తిని రగిలించేలా పవర్‌ఫుల్‌గా భగ భగ సాంగ్ రిలీజ్- రెహమాన్ రాసిన లిరిక్స్‌తో చైనా పీస్ కొత్త పాట

ఇప్పటికే చైనా పీస్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన చైనా పీస్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు తాజాగా మరో ప్రమోషనల్ కంటెంట్‌తో చైనా పీస్ మేకర్స్ వచ్చారు.

కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్

తాజాగా మేకర్స్ చైనా పీస్ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు. కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళ్లింది. తన పదాలని ఆయుధాలుగా మార్చి రెహమాన్ రాసిన లిరిక్స్ అందరినీ హత్తుకుంటున్నాయి.

చైనా పీస్ సాంకేతిక వర్గం

ఇదిలా ఉంటే, చైనా పీస్ చిత్రానికి సురేష్ రగుతు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్‌గా పని చేయగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వనాథ రెడ్డినే కథ కూడా అందించారు. చైనా పీస్ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిహాల్

ఆ తర్వాత పంచతంత్ర కథలు సినిమాలో నటించాడు నిహాల్ కోధాటి. అనంతరం బ్యూటిఫుల్ హీరోయన్ అనుపమ పరమేశ్వరన్ లేడి ఒరియెంటెడ్ సినిమా బటర్‌ఫ్లైలో హీరోగా చేశాడు నిహల కోధాటి. 2022లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన బటర్‌ఫ్లై పర్వాలేదనిపించుకుంది.

2025లో టుక్ టుక్

అనంతరం 2023 సంవత్సరం ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, శంతాల, గతేడాది 2025లో టుక్ టుక్ వంటి సినిమాలు చేశాడు నిహాల్ కోధాటి. ఇప్పుడు హీరోగా చైనా పీస్ సినిమాతో తన సినీ కెరీర్‌ను పరీక్షించుకోనున్నాడు నిహల్ కోధాటి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe