Dark Comedy Thriller Bibi Payra OTT Release: చలనచిత్ర రంగంలో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు, వినూత్నమైన కథాంశాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో వస్తున్న విలక్షణమైన ప్రయోగాలు ఓటీటీల పుణ్యమా అని భాషా బేధం లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
అంతుచిక్కని రహస్యాలు

ఈ క్రమంలోనే థియేటర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేటెస్ట్ బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'బిబి పాయ్‌రా' (Bibi Payra) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. బార్‌లో మద్యం తాగే ఇద్దరి భార్యల చుట్టూ, వారి జీవితాల్లోని అంతు చిక్కని రహస్యాలతో ఈ సినిమా సాగుతుంది.
ఆ ఇద్దరి తిరుగుబాటు.. హద్దులు దాటిన సాహసం
బిబి పాయ్‌రా సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సమాజంలోనూ, కుటుంబంలోనూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ, నిరుత్సాహకరమైన వైవాహిక జీవితాలను గడుపుతున్న ఇద్దరు సాధారణ మహిళల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
రోజువారీ జీవితంలోని ఒత్తిడి, భర్తల ప్రవర్తనతో విసిగిపోయిన వీరు ఒకానొక దశలో తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. తమ గమ్యాన్ని మార్చుకోవడానికి వారు వేసిన అడుగులు, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఊహించని మలుపులు తిరుగుతాయి.
డార్క్ కామెడీ శైలీలో
స్వతంత్రంగా బతకాలనే ఆశతో వారు వేసిన ప్లాన్ కాస్తా మిస్ ఫైర్ అయి, గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. ఈ క్రమంలో జరిగే పొరపాట్లు, ఎదురయ్యే ఇబ్బందులను దర్శకుడు అత్యంత వినోదాత్మకంగా, డార్క్ కామెడీ (Dark Comedy) శైలిలో తెరకెక్కించారు.
ఈ ప్రయాణంలో వారికి అనుకోని వ్యక్తులు సహాయం చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే, వారు సాధించాలనుకున్న స్వేచ్ఛ చివరికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసిందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
వెండితెరపై నటీనటుల మెరుపులు
{{/usCountry}}ఈ ప్రయాణంలో వారికి అనుకోని వ్యక్తులు సహాయం చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే, వారు సాధించాలనుకున్న స్వేచ్ఛ చివరికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసిందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
వెండితెరపై నటీనటుల మెరుపులు
{{/usCountry}}ఈ చిత్రానికి ప్రధాన బలం ఇందులోని స్టార్ కాస్టింగ్ అనే చెప్పాలి. టాలెంటెడ్ నటీమణులు స్వాస్తిక ముఖర్జీ, పావలి దామ్ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. వీరితో పాటు రూపాలీ రాయ్ భట్టాచార్య, భబాని బోస్ ముఖర్జీ, అనిర్బన్ చక్రవర్తి, అనింద్య సేన్‌గుప్తా, సుబ్రత్ దత్తా, లోక్‌నాథ్ డే, అంకిత మాఝీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
బాక్సాఫీస్ నుంచి ఓటీటీ దాకా
మధ్యతరగతి జీవితాల్లోని రహస్యాలను, సమాజపు వైరుధ్యాలను ఈ పాత్రల ద్వారా దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.6 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఇలాంటి బిబి పాయ్‌రా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ బెంగాలీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హోయ్‌చోయ్‌లో బిబి పాయ్‌రా ఓటీటీ రిలీజ్ అయింది. జూన్ 5 నుంచి హోయ్‌చోయ్‌లో బిబి పాయ్‌రా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హోయ్‌చోయ్ ఓటీటీలో
ప్రస్తుతం కేవలం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో బెంగాలీ భాషలో మాత్రమే బిబి పాయ్‌రా ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు సస్పెన్స్, డార్క్ హ్యూమర్, మహిళా సాధికారిత వంటి అంశాలతో సాగే బిబి పాయ్‌రా సినిమాను హోయ్‌చోయ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.