...
...
Next Story

Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో నిన్న ఇవాళ ఎలిమినేషన్- విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్- 12 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss Elimination Temper Vamsi Remuneration: బిగ్ బాస్ 10 తెలుగు 12వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఇప్పటికే శనివారం నాటి ఎపిసోడ్‌లో టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. మరి హౌజ్‌లో 12 వారాలపాటు ఉన్న టెంపర్ వంశీ రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 29, 2026, 07:52:01 IST
Advertisement

Bigg Boss 10 Telugu 12th Week Elimination Temper Vamsi Remuneration: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' చివరి దశకు చేరుకుంటోంది. ఫినాలే సమీపిస్తున్న కొద్దీ హౌస్‌లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ 10 తెలుగు 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం.

బిగ్ బాస్‌లో నిన్న ఇవాళ ఎలిమినేషన్- విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్- 12 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్‌లో నిన్న ఇవాళ ఎలిమినేషన్- విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్- 12 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

గత వారం కేవలం ఒక్కరిని మాత్రమే ఇంటికి పంపిన నిర్వాహకులు, ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ బాంబు పేల్చడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడాడు.

డేంజర్ జోన్‌లో ఇద్దరు.. వంశీ అవుట్!

అయితే, బిగ్ బాస్ తెలుగు 10 ఈ వారం నామినేషన్స్‌లో త్రిగుణ్, ముఖేష్ గౌడ, ఆటో రామ్ ప్రసాద్, దేబ్జానీ, రామకృష్ణ, టెంపర్ వంశీ, వర్షిణి ఏడుగురు నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‌ను బట్టి త్రిగుణ్, ముఖేష్ టాప్ పొజిషన్‌లో దూసుకుపోయారు. ఆ తర్వాత జబర్దస్త్ రామ్ ప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీ మోదక్ మధ్యస్థ ఓట్లతో సేఫ్ జోన్‌లోకి వెళ్లారు.

చివరి స్థానాలతో వంశీ, వర్షిణి డేంజర్ జోన్‌లో మిగిలారు. బిగ్ బాస్ 10 తెలుగు శనివారం (నవంబర్ 28) వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్‌లో భాగంగా మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటింగ్‌లో అందరికంటే తక్కువ ఓట్లు రావడంతో టెంపర్ వంశీని హౌస్ నుంచి బయటకు పంపేశారు.

వర్షిణి కూడా ఇంటిబాటేనా?

ఈ షూటింగ్ ప్రకారం వర్షిణి ఇంటిబాట పట్టిందని ఖరారు అయింది. కానీ, బిగ్ బాస్ 10 తెలుగు శనివారం నాటి ఎపిసోడ్ ప్రసారం అయ్యాకే వర్షిణి సౌందరరాజన్ ఎలిమినేట్ అయినట్లు అధికారికంగా అయ్యాకే తెలుస్తుంది.

12 వారాల ప్రయాణం..

ఇదిలా ఉంటే, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న టెంపర్ వంశీ ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే 10వ సీజన్‌లో అడుగుపెట్టారు. అద్భుతమైన ఆటతీరు కనబరచకపోయినా, ఉన్నంతలో తన వంతు ప్రయత్నం చేస్తూ 12 వారాల పాటు హౌస్‌లో కొనసాగారు. అదృష్టం కలిసిరావడంతో గతంలో ఒకట్రెండు సార్లు ఎలిమినేషన్ అంచుకు వెళ్లి సురక్షితంగా బయటపడ్డారు.

కానీ, తాజాగా మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు టెంపర్ వంశీ. స్టేజీపైకి వచ్చిన తర్వాత వంశీ ఏమాత్రం భావోద్వేగానికి లోనుకాలేదు. తన 12 వారాల జర్నీ వీడియోను చూసి ఆనందించిన ఆయన "ఎలాగైనా కప్పు కొట్టాలి" అంటూ త్రిగుణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి వీడ్కోలు పలికారు.

టెంపర్ వంశీ రెమ్యునరేషన్

ఇకపోతే, టెంపర్ వంశీ బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ.2 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన 12 వారాలకు గాను టెంపర్ వంశీ మొత్తంగా రూ. 24 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ నడుస్తోంది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks