...
...
Next Story

Bigg Boss Abijeet: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 లేడి కంటెస్టెంట్ చెప్పులు క్లీన్ చేసిన హీరో అభిజీత్- కొంచెం కండ పట్టిందంటూ!

Bigg Boss Agnipariksha 2 Abijeet Lady Contestant: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ అగ్ని పరీక్ష 2 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందులో ఓ లేడి కంటెస్టెంట్ చెప్పులను జడ్జ్ అభిజీత్ క్లీన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Aug 13, 2026, 14:19:50 IST
Advertisement

Bigg Boss Agnipariksha 2 Abijeet Lady Contestant: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 10 సందడి నెలకొంది. సెప్టెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్‌లోకి సామాన్యులను పంపేందుకు నిర్వహించే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా ఆగస్ట్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమో

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 లేడి కంటెస్టెంట్ చెప్పులు క్లీన్ చేసిన హీరో అభిజీత్- కొంచెం కండ పట్టిందంటూ!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 లేడి కంటెస్టెంట్ చెప్పులు క్లీన్ చేసిన హీరో అభిజీత్- కొంచెం కండ పట్టిందంటూ!

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది స్టార్ మా. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన లేటెస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమోలో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగ్ని పరీక్షకు హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, బిగ్ బాస్ తెలుగు 4 విజేత, హీరో అభిజీత్ దుద్దాల జడ్జెస్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఒక మనిషిగా నువ్వు ఏంటీ

ఇక లేటెస్ట్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలో ఓ కంటెస్టెంట్ వస్తే.. నీ పర్సనాలిటీ ఏంటీ, ఒక మనిషిగా నువ్వు ఏంటని నవదీప్ అడిగాడు. దానికి అతను "నేను చాలా బోల్డ్ అని చెబుతాను. అంటే ఫియర్‌లెస్‌గా ఉంటాను. ఏం చేయడానికైనా డేర్‌గా ఉంటాను" అని చెప్పాడు. దాంతో నవదీప్ "అయితే నువ్వు పుషప్ చేయి నేను వెయిట్స్ పెడతాను" అని 10 కేజీల వెయిట్ పెడతాడు.

8 నెలలగా జిమ్‌లో

"ఏది చూపియ్ కండ" అని శ్రీముఖి అడిగితే.. ఆమె చూపిస్తుంది. "ఏయ్ టచ్ చేసి చూడు స్కూల్ బెంచీలా లేదు" అని నవదీప్ కామెడీ చేశాడు. దాంతో అంతా నవ్వేస్తారు. తర్వాత "నువ్వు షూస్ క్లీన్ చేయాలి" అని బిందు మాధవి టాస్క్ ఇస్తుంది. "అది నేను అస్సలు చేయను, అది చాలా అగౌరవపరచడమే" అని ఆ లేడి కంటెస్టెంట్ అంటుంది.

ఏ పని అయినా చిన్నది కాదు

"ఏ పని అయినా చిన్నదని, పెద్దదని కాదు" అని అభిజీత్ అనడంతో ఆమె క్లీన్ చేస్తుంది. కానీ, నీళ్ల బకెట్‌లో అలాగే షూస్ పెడుతుంది. "షూస్ ఎప్పుడు వాటర్‌లో ముంచేయరమ్మా.. ఇది నువ్వు చాలా జోక్‌గా తీసుకుంటున్నావ్. ఇట్స్ రెడ్ ఫ్రమ్ మీ" అని బిందు మాధవి ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇస్తుంది.

ఏడ్చేసిన లేడి కంటెస్టెంట్

తర్వాత "ఏ పని అయినా తక్కువది కాదు" అని చెబుతూ ఆ లేడి కంటెస్టెంట్ చెప్పులను క్లీన్ చేస్తాడు జడ్జ్ అభిజీత్. దాంతో శ్రీముఖి, లేడి కంటెస్టెంట్ షాక్ అవుతారు. అభిజీత్ చేసిన పనికి లేడి కంటెస్టెంట్ ఏడుస్తుంది. అభిజీత్ నవ్వుతూ రిటర్న్ అవుతాడు. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమో ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe