3 నెలల ఎంటర్‌టైన్‌మెంట్ 2 గంటల్లో- డిమాన్ పవన్ చెంపపై రీతూ చౌదరి లిప్‌స్టిక్ మరకలు- బుజ్జి బంగారం అంటూ స్టేజీపై ముద్దులు

బిగ్ బాస్ తెలుగు 9తో మంచి క్రేజ్ తెచ్చుకున్న జంట డిమాన్ పవన్, రీతూ చౌదరి. సీజన్ 9 పూర్తయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేశారు. ఈ షోలో స్టేజీపై అందరి ముందు డిమాన్ పవన్‌కు రీతూ చౌదరి ముద్దులు పెట్టి మా బుజ్జి బంగారం అంటూ పొగిడేసింది.

Published on: Dec 30, 2025, 20:16:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొన్నటి వరకు బిగ్ బాస్ 9 తెలుగు హవా కొనసాగింది. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా కల్యాణ్ పడాల కాగా.. రన్నరప్‌గా తనూజ గౌడ, సెకండ్ రన్నరప్‌గా డిమాన్ పవన్ నిలిచారు. అయితే, తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కంటెస్టెంట్స్ అంతా ఆదివారం విత్ స్టార్ మా పరివారం టీవీ షోలో పాల్గొని సందడి చేశారు.

3 నెలల ఎంటర్‌టైన్‌మెంట్ 2 గంటల్లో- డిమాన్ పవన్ చెంపపై రీతూ చౌదరి లిప్‌స్టిక్ మరకలు- బుజ్జి బంగారం అంటూ స్టేజీపై ముద్దులు
3 నెలల ఎంటర్‌టైన్‌మెంట్ 2 గంటల్లో- డిమాన్ పవన్ చెంపపై రీతూ చౌదరి లిప్‌స్టిక్ మరకలు- బుజ్జి బంగారం అంటూ స్టేజీపై ముద్దులు

బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్‌తో

యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా చేస్తున్న ఈ షోలో డిమాన్ పవన్‌కు స్టేజీపైనే అందరి ముందు ముద్దులు పెట్టేసింది రీతూ చౌదరి. దీనికి సంబంధించిన ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రోమోలో బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం

"బిగ్ బాస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్‌టైన్‌మెంట్ మా పరివారంలో రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం. గెట్ రెడీ" అంటూ శ్రీముఖి చెప్పింది. "ఫస్ట్ ఏ కామనర్ అయిన శ్రమ పడాలా, కష్ట పడలా అప్పుడే అవుతారు కల్యాణ్ పడాల" అని కమెడియన్ ఎలివేషన్ ఇచ్చాడు.

అది మరిచిపోయారు జనాలు

"బాబులకే బాబు కల్యాణ్ బాబు" అని శ్రీజ అంది. దాంతో "బయట శ్రీజ చేసే హడావిడికి గెలిచింది ఇదా.. వీడా మరిచిపోయారు జనాలు" అని ఇమ్మాన్యూయెల్ పంచ్ వేశాడు. తర్వాత ఇమ్మూను హగ్ చేసుకుంది శ్రీముఖి. "మా కమెడియన్స్‌కు ఎందుకండి కప్ ఇవ్వరు" అని అవినాష్ అన్నాడు.

డిమాన్‌లా అవినాష్

"కామనర్‌గా అడుగు పెట్టావ్. తర్వాత టాప్ 3కి వెళ్లి సూట్‌కేస్‌తో బయటకు వచ్చావ్. ఎలా అనిపిస్తుంది" అని డిమాన్ పవన్‌ను యాంకర్ శ్రీముఖి అడిగింది. దానికి "చాలా హ్యాపీ అనిపిస్తుంది" అని పవన్ అన్నట్లుగా అవినాష్ అన్నాడు. దానికి అంతా నవ్వేశారు.

అందరి ముందు ముద్దు

"బిగ్ బాస్ హౌజ్‌లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే రీతూ" అని డిమాన్ పవన్ చెప్పాడు. దానికి శ్రీముఖి అరిచింది. రీతూ తెగ సంబరపడిపోయింది. "నా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ జెన్యూన్.. మా బుజ్జి బంగారం డిమాన్" అంటూ డిమాన్ పవన్ చెంపపై రీతూ చౌదరి స్టేజీపైనే అందరి ముందు ముద్దు పెట్టేసింది. దానికి అంతా అరిచేశారు.

చెంపపై లిప్‌స్టిక్ మరకలు

డిమాన్ పవన్ చెంపపై రీతూ చౌదరి లిప్‌స్టిక్ మరకలు చూపిస్తూ ఏడిపించారు మిగతా కంటెస్టెంట్స్. ఆడియెన్స్ చప్పట్లు, విజిల్స్‌తో ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అలా ముగిసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More