Bigg Boss 10 Telugu September 13 Episode Highlights: బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ 10 తెగ అలరిస్తోంది. నాగార్జున హోస్ట్ ఎప్పటిలాగే ఉన్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో వచ్చే ట్విస్టులు, గొడవలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ వారం పవర్ ఆఫ్ పీపుల్

బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో ప్రతి వారం సరికొత్త అవతారం ఉంటుందని నాగార్జున చెప్పాడు. గత వారం దశావతారం ఉంటే ఈ వారం పవర్ ఆఫ్ పీపుల్ అని వెల్లడించారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారానే కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేయనున్నారు.
ఇదిలా ఉంటే, నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో నాగార్జున ఒక బ్లాక్ కీతో ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 10లో పదిమంది కంటెస్టెంట్స్‌కు 10 మ్యాజికల్ పవర్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో శాలిని పటేల్ తన పవర్ ఇదివరకే ఉపయోగించుకుంది.
పవర్‌ను పోగొట్టే బ్లాక్ కీ
ఇప్పుడు తొమ్మిది మందికి మ్యాజికల్ పవర్ ఉంది. ఇక నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని హౌజ్‌లోకి పంపారు. దాన్ని రోహిత్ నాయిడుని తీసుకురమ్మని చెప్పిన నాగార్జున అది ఎందుకో గెస్ చేయమన్నాడు. దానివల్ల ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఒకరి పవర్‌ను డిసేబుల్ చేయడానికి అనుకుంటున్నా అని రోహిత్ చెప్పగానే కరెక్ట్ అని నాగార్జున చెప్పాడు.
9 మంది కంటెస్టెంట్స్‌ను గార్డెన్ ఏరియాలో నిల్చొబెట్టి ఆ బ్లాక్ కీని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అన్నాడు. అలా అందరూ చెప్పగా ఎక్కువగా సృష్టి వ్యాకరణం పేరును ఎక్కువగా ఐదుగురు కంటెస్టెంట్స్ చెప్పారు. దాంతో కామనర్ అయిన సృష్టి తనకున్న మ్యాజికల్ పవర్ కోల్పోవాల్సి వచ్చింది.
డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్
సృష్టికి హౌజ్‌లో ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ మ్యాజికల్ కీ ద్వారా వచ్చింది. ఇప్పుడు బ్లాక్ కీతో ఆ పవర్ పోయింది. ఇక సృష్టి పవర్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికి ఎలాంటి పవర్ రాని కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెట్టాడు నాగార్జున. రోహిత్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ మోదక్, సుధీర్ రెడ్డి నలుగురి మధ్య ఆ పోటీ నడిచింది.
{{/usCountry}}సృష్టికి హౌజ్‌లో ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ మ్యాజికల్ కీ ద్వారా వచ్చింది. ఇప్పుడు బ్లాక్ కీతో ఆ పవర్ పోయింది. ఇక సృష్టి పవర్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికి ఎలాంటి పవర్ రాని కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెట్టాడు నాగార్జున. రోహిత్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ మోదక్, సుధీర్ రెడ్డి నలుగురి మధ్య ఆ పోటీ నడిచింది.
{{/usCountry}}నలుగురికి డిఫరెంట్ కలర్స్ ఉన్న సాండ్ బ్యాగ్స్ ఇచ్చి ఎదురుగా ఉన్న హోల్‌లో పడేయాలని నాగార్జున చెప్పాడు. అలా మొదట ఐదు బ్యాగ్స్ పడిన వారు పోటీలో గెలిచినట్లు, వారికి సృష్టి కోల్పోయిన మ్యాజికల్ పవర్ కీ దక్కుతుందన్నారు. చాలా ఫాస్ట్‌గా మొదట 5 బ్యాగ్స్ హోల్స్‌లో వేసి యాంకర్ సుధీర్ రెడ్డి ఆ టాస్క్ గెలిచాడు.
సుధీర్ వెన్నుపోటు
దాంతో సుధీర్‌కు సృష్టి పవర్ వచ్చేసింది. తన దగ్గరున్న మ్యాజికల్ పవర్ కీని సుధీర్‌కు సృష్టి అందజేసింది. నా పవర్ పోయేందుకు నువ్వు కూడా ఓట్ చేయడం నాకు బాధగా అనిపించిందని సృష్టి చెప్పింది. సృష్టికి ఫ్రెండ్‌లా ఉన్న సుధీరే తన పవర్ పోయేందుకు ఓట్ వేసి నిజంగానే వెన్నుపోటు పొడిచినట్లు అయింది.
మ్యాజిక్ పవర్ కీ బాక్స్‌పై ఉన్న సృష్టి ఫొటో తీసి తన ఫొటో పెట్టుకోమ్మని సుధీర్‌కు నాగార్జున చెప్పాడు. ఆ సీక్రెట్ పవర్ ఏంటో సుధీర్‌కు బిగ్ బాస్ చెబుతారని, ఇదివరకు తెలిసిన సృష్టి మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పకూడదని, చెబితే డైరెక్ట్ ఇంటి నుంచి అవుట్ (ఎలిమినేట్) అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇలా ఓవరాల్‌గా చేస్తే ఫ్రెండ్‌గా ఉన్న సృష్టికే వెన్నుపోటు పొడిచి చివరికి తనే ఆ మ్యాజిక్ పవర్‌ను సుధీర్ రెడ్డి సొంతం చేసుకున్నట్లు అయింది.