బిగ్ బాస్ ఓటింగ్‌లో కల్యాణ్ కంటే ఆమెకు 10 శాతం అధిక ఓట్లు- రోజుకొకరు టాప్-డేంజర్‌లో నలుగురు-ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పన్నెండో వారాన్ని కూడా పూర్తి చేసేందుకు రెడీగా ఉంది. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్‌లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్‌లో ఉంటున్నారని సమాచారం. అయితే, ఈ వారం కూడా బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ నడుస్తోంది.

Nov 28, 2025, 09:20:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆకట్టుకుంటోంది. పదకొండో వారం ఫ్యామిలీ వీక్ సాగగా పన్నెండో వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌజ్‌మేట్స్‌తో పోటీ పడుతూ టాస్క్‌లు ఆడారు.

బిగ్ బాస్ ఓటింగ్‌లో కల్యాణ్ కంటే ఆమెకు 10 శాతం అధిక ఓట్లు- రోజుకొకరు టాప్-డేంజర్‌లో నలుగురు-ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ ఓటింగ్‌లో కల్యాణ్ కంటే ఆమెకు 10 శాతం అధిక ఓట్లు- రోజుకొకరు టాప్-డేంజర్‌లో నలుగురు-ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్

మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణతో మొదలైన ఈ ఎంట్రీ బ్రహ్మముడి మానస్, ప్రేరణ కంబం, హీరో సయ్యద్ సోహైల్, దేత్తడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే పన్నెండో వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ఫేస్ చేయనున్నారు.

నామినేషన్స్‌లో 8 మంది

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వారిలో కల్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణి శంకర్, దివ్య నిఖితా, ఇమ్మాన్యూయెల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ ఇలా ఎనిమిది మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్ ఆడించారు.

ఇద్దరు పోటాపోటీగా

అయితే, బిగ్ బాస్ ఓటింగ్‌లో కల్యాణ్ పడాల, సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కోరోజు ఒకరు టాప్ 1 ఓటింగ్‌లో ఉంటున్నారు. ఈ వారం అంతా అలాగే సాగింది. అయితే, ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదు అవుతోంది.

కల్యాణ్‌ను దాటేసిన హీరోయిన్

మొన్నటి వరకు టాప్ 1లో కల్యాణ్ సాగుతూ వస్తున్నాడు. కానీ, ఈ మధ్య కల్యాణ్‌ను తనూజ దాటేసి ముందంజలోకి వచ్చేస్తోంది. ఇక యూట్యూబ్ పోల్స్‌లో అయితే కల్యాణ్ పడాల కంటే తనూజ పుట్టస్వామికి పది శాతం ఓట్లు అధికంగా పడుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ గౌడనే ఉన్నట్లు తెలుస్తోంది.

మంచి కంటెస్టెంట్స్ డేంజర్‌లో

ఇక డేంజర్ జోన్‌లో నలుగురు మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ డిమాన్ పవన్, సీరియల్ విలన్ భరణి శంకర్, బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రాని, కమెడియన్ సుమన్ శెట్టి. ఈ నలుగురికి దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతోందట. వీరిలో ఎవరు ముందు ఉన్నారు ఎవరు చివరిలో ఉన్నారో చెప్పడం కష్టంగా ఉందని రివ్యూవర్స్ చెబుతున్నారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్

దాంతో ఈ నలుగురిలోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉందని ఇన్‌సైడ్ టాక్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవనున్నారు అని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More