...
...
Next Story

OTT Crime: పొరపాటున కూడా మీ భర్తతో ఈ ఓటీటీ సిరీస్ చూడకండి- ట్విస్టులతో సాగే ముగ్గురు భార్యల డార్క్ క్రైమ్ థ్రిల్లర్!

OTT Crime Thriller Series Black Widows Streaming: భర్తలను అంతమొందించే ముగ్గురు మహిళల కథతో తెరకెక్కిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్'బ్లాక్ విడోస్'. మోనా సింగ్, షమితా శెట్టి, స్వాస్తిక ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్విస్టులు, ఊహించని మలుపులతో సాగుతుంది. అదెక్కడో చూద్దాం.

Published on: Oct 18, 2026, 17:03:17 IST
Advertisement

OTT Crime Thriller Series Black Widows Release: ఓటీటీ ప్రియులకు థ్రిల్లర్, సస్పెన్స్ కథలంటే విపరీతమైన క్రేజ్. అందులోనూ కాస్త డార్క్, క్రైమ్, కామెడీ కలసిందంటే వీక్షకులు అస్సలు వదిలిపెట్టరు. అటువంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఓటీటీ సిరీస్ 'బ్లాక్ విడోస్'.

వైవాహిక బంధంలో వేధింపులు

పొరపాటున కూడా మీ భర్తతో ఈ ఓటీటీ సిరీస్ చూడకండి-  ట్విస్టులతో సాగే ముగ్గురు భార్యల డార్క్ క్రైమ్ థ్రిల్లర్!
పొరపాటున కూడా మీ భర్తతో ఈ ఓటీటీ సిరీస్ చూడకండి- ట్విస్టులతో సాగే ముగ్గురు భార్యల డార్క్ క్రైమ్ థ్రిల్లర్!

వేధింపులతో కూడిన వైవాహిక బంధాల నుంచి బయటపడేందుకు భర్తలను హతమార్చాలని నిర్ణయించుకున్న ముగ్గురు భార్యల సంచలన కథ ఇది. ఇలాంటి బ్లాక్ విడోస్ ఓటీటీలో 2020 సంవత్సరం నుంచి ఆకట్టుకుంటోంది.

అసలు కథేంటంటే..

వీరా, జయంతి, కవిత అనే ముగ్గురు మహిళలు తమ భర్తల చేతిలో రోజూ మానసికంగా, శారీరకంగా నరకం చూస్తుంటారు. కేవలం విడాకులు తీసుకోవడం వల్ల తమ సమస్య పూర్తిగా తీరదని భావించిన ఈ ముగ్గురు, క్రూరమైన భర్తల పీడ శాశ్వతంగా వదిలించుకోవడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తారు. వీకెండ్ సెలవుల కోసం సరస్సు ఒడ్డున గడుపుతున్న సమయంలో, భర్తలు ప్రయాణిస్తున్న స్పీడ్‌బోట్‌లో బాంబు అమర్చి పేల్చేస్తారు.

ట్విస్టులు.. ఊహించని మలుపులు!

భర్తల చావుతో తమకు స్వేచ్ఛ లభించిందని భావించిన ఆ ముగ్గురు మహిళలకు త్వరలోనే ఊహించని షాక్ ఎదురవుతుంది. వీరా భర్త జతిన్ ఆ బాంబు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి రహస్యంగా దాక్కుంటాడు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభిస్తారు.

పోలీసుల విచారణను తిప్పికొట్టారా?

పైకి అమాయకంగా కనిపిస్తున్న ఈ ముగ్గురు భార్యల వెనుక ఉన్న అసలు రూపాన్ని పోలీసులు అనుమానిస్తారు. పోలీస్ విచారణలో ఎలాంటి సత్యాలు వెలుగు చూశాయి? భార్యల ప్లాన్‌ను పోలీసులు కనిపెట్టారా? పోలీసుల విచారణను భార్యలు తిప్పికొట్టారా? లేదా? అనేది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ.. మేకింగ్ హైలైట్స్

తక్కువ సమయమే తెరపై కనిపించినా శరద్ కేల్కర్ తనదైన శైలిలో నటనతో మెప్పించారు. సబ్యసాచి చక్రవర్తి, అమీర్ అలీ, రాయ్మా సేన్ తదితరులు తమ పాత్రలకు తగిన రీతిలో న్యాయం చేశారు.

ఎక్కడ చూడవచ్చు?

క్రైమ్, డార్క్ కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ నిండిన 'బ్లాక్ విడోస్' వెబ్ సిరీస్ ప్రముఖ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో మొత్తం 12 ఎపిసోడ్‌లు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 26 నుంచి 32 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఓటీటీలో వీకెండ్‌కి బెస్ట్

ఐఎమ్‌డీబీ (IMDb) లో ఈ ఓటీటీ సిరీస్‌కు 6.8 రేటింగ్ లభించింది. వీకెండ్‌లో క్రైమ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి జీ5 ఓటీటీలోని ఈ బ్లాక్ విడోస్ బెస్ట్ ఎంపిక.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks