ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్- హాట్ బ్యూటీగా క్రేజ్- ఇంజక్షన్స్ వాడారా అంటూ ప్రశ్నలు- అసలు సీక్రెట్ చెప్పిన భూమి

ఇంజెక్షన్లు లేకుండా బరువు తగ్గడం సాధ్యం కాదని చాలామంది నమ్ముతున్నారని బాలీవుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ అసహనం వ్యక్తం చేశారు. తను ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన తీరును, ఎదుర్కొన్న విమర్శలను సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో భూమి పెడ్నేకర్ పంచుకున్నారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 10, 2026, 13:39:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ తారల్లో ఎంతోమంది బరువు పెరగడం, తగ్గడం వంటివి చేశారు. కానీ, ఏకంగా 40 కిలోల బరువు తగ్గి హాట్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమి పెడ్నేకర్. అయితే, భూమి పెడ్నేకర్ అనగానే ‘దమ్ లగా కే హైషా’ సినిమా గుర్తొస్తుంది.

ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్- హాట్ బ్యూటీగా క్రేజ్- ఇంజక్షన్స్ వాడారా అంటూ ప్రశ్నలు- అసలు సీక్రెట్ చెప్పిన భూమి
ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్- హాట్ బ్యూటీగా క్రేజ్- ఇంజక్షన్స్ వాడారా అంటూ ప్రశ్నలు- అసలు సీక్రెట్ చెప్పిన భూమి

ఆ ప్రచారం

‘దమ్ లగా కే హైషా’ మూవీ కోసం భారీగా బరువు పెరిగిన భూమి పెడ్నేకర్ ఆ తర్వాత కేవలం కొద్ది కాలంలోనే 30 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు బరువు తగ్గుతున్నారంటే చాలు.. వారు ‘ఓజెంపిక్’ (Ozempic) వంటి ఇంజెక్షన్లు వాడుతున్నారని ప్రచారం జరగడం సాధారణమైపోయింది.

భూమి పెడ్నేకర్ కూడా అలాంటి ఇంజక్షన్స్ వాడిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి వస్తున్న రూమర్లపై భూమి పెడ్నేకర్ చాలా ఘాటుగా స్పందించారు.

డెంగ్యూ వల్ల 12 కిలోలు తగ్గాను!

మరో బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో భూమి పెడ్నేకర్ తన ఆరోగ్య సమస్యల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. 2023 నవంబర్‌లో తాను డెంగ్యూ బారిన పడి ఆస్పత్రిలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఆ సమయంలో నేను పడ్డ నరకం అంతా ఇంతా కాదు. ఒకవైపు దీపావళి టపాసుల శబ్దాలు, మరోవైపు తల పగిలిపోయేంతగా తలనొప్పి. ఆ అనారోగ్యం వల్ల నేను 12 కిలోల బరువు తగ్గడంతో పాటు సగం జుట్టును కోల్పోయాను" అని భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒక పాత్ర కోసం తాను మరింత కష్టపడి బరువు తగ్గానని తెలిపారు.

ఇంజక్షన్స్ వాడుతున్నారా?

ఇంజెక్షన్లు వాడకుండా బరువు తగ్గడం అసాధ్యమనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని భూమి పెడ్నేకర్ అసహనం వ్యక్తం చేశారు. "నేను పదేళ్ల పాటు జిమ్‌లో చెమటోడ్చాను. పద్ధతిగా ఆహారం తీసుకున్నాను. కానీ, ప్రజలు మాత్రం ‘మీరు పక్కటెముక తొలగించుకున్నారా?’ అని అడుగుతున్నారు" అని భూమి తెలిపారు.

"ఢిల్లీలో అయితే మహిళలు నేరుగా నా దగ్గరకు వచ్చి ‘మీరు కూడా ఓజెంపిక్ లేదా మౌంజారో ఇంజెక్షన్లు తీసుకున్నారా?’ అని అడిగేశారు. నిజానికి నేను 40 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గాను, అది కూడా ఎలాంటి ఇంజెక్షన్లు లేకుండానే" అని భూమి పెడ్నేకర్ స్పష్టం చేశారు.

వైద్యపరమైన అవసరం ఉండి ఆ మందులు వాడేవారిని తాను తప్పుపట్టనని, కానీ తన కష్టాన్ని గుర్తించకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్.

ఏమిటీ ఓజెంపిక్?

అయితే, ఓజెంపిక్, మౌంజారో అనేవి ప్రాథమికంగా టైప్-2 డయాబెటిస్ రోగుల కోసం ఇచ్చే ఇంజక్షన్ మందులు. ఇవి ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ లక్షణం వల్ల చాలామంది వీటిని బరువు తగ్గడానికి వాడుతున్నారు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు (Side effects) కలిగే ప్రమాదం ఉంది.

భూమి కెరీర్ ముచ్చట్లు

కాగా, భూమి పెడ్నేకర్ చివరిగా 2025లో విడుదలైన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమాలో కనిపించారు. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ప్రస్తుతం ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ది రాయల్స్’ సీజన్ 2లో భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. అయితే, ది రాయల్స్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓటీటీ సిరీస్ ది రాయల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More