Rajkummar Rao Real Story On His Birthday: బాలీవుడ్ స్టార్ హీరోల్లో రాజ్ కుమార్ రావు రూటే వేరు. కమర్షియల్ హంగులతో సంబంధం లేకుండా కథాబలమున్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నేషనల్ అవార్డు విన్నర్.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ రావు 42వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావు బాలీవుడ్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కన్నీటి గాథలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రోజుకు 140 కిలోమీటర్ల సైక్లింగ్!
గురుగ్రామ్‌కు చెందిన రాజ్ కుమార్ రావుకు చిన్నప్పటి నుంచే నటనపై పిచ్చి ఉండేది. స్కూల్ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆయనలోని ప్రతిభను గుర్తించిన తల్లి, నటన వైపు వెళ్లమని ప్రోత్సహించారు. 18 ఏళ్ల వయసులో ఢిల్లీలోని 'శ్రీరామ్ సెంటర్'లో యాక్టింగ్ క్లాసులకు వెళ్లేందుకు ప్రతీరోజూ గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి సైకిల్‌పై వెళ్లేవారు.
అటు ఇటు కలిపి రోజుకు ఏకంగా 140 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఆ సమయంలో వాక్‌మెన్‌లో "లక్ష్య", "పాపా కహ్తే హై" పాటలు వింటూ ప్రయాణం సాగించేవారని, అది వినడానికి కాస్త సినిమాటిక్‌గా అనిపించినా, అప్పట్లో తన అసలు నిజ జీవితం అదేనని రాజ్ కుమార్ రావు వెల్లడించారు.
బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు
దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' సినిమాతో రాజ్ కుమార్ రావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాకు ఆయనకు లభించిన రెమ్యూనరేషన్ కేవలం రూ.11,000 మాత్రమే.
{{/usCountry}}దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' సినిమాతో రాజ్ కుమార్ రావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాకు ఆయనకు లభించిన రెమ్యూనరేషన్ కేవలం రూ.11,000 మాత్రమే.
{{/usCountry}}ఆ డబ్బుతోనే నెల రోజులు గడిపిన రాజ్ కుమార్, ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా డబ్బుల కోసం నాసిరకం పాత్రలను ఒప్పుకోలేదు. ముంబై మహానగరం ఆయనకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒకానొక దశలో బ్యాంకు ఖాతాలో కేవలం 18 రూపాయలు మాత్రమే మిగిలాయి.
రూ.4తో మధ్యాహ్న భోజనం!
"జీవితంలో అత్యంత కష్టమైన సమయం అంటే ఆర్థిక ఇబ్బందులు రావడం, చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడమే. నా తల్లి నన్ను ఎంతో ఆదుకుంది. డబ్బులు లేనప్పుడు ఆమె సర్దుబాటు చేసి పంపించేది" అని రాజ్ కుమార్ రావు చెప్పాడు.
"ముంబై లాంటి నగరంలో నా ఖాతాలో కేవలం 18 రూపాయలు ఉన్న రోజులు గుర్తున్నాయి. ముగ్గురం కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. మధ్యాహ్నం భోజనం మానేసి రూ.2ల పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్, రూ.2ల ఫ్రూటీతో కడుపు నింపుకునేవాడిని" అని రాజ్ కుమార్ రావు తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ కష్ట కాలంలో ఎఫ్‌టీఐఐ (FTII) స్నేహితులు, సీనియర్లు ఆయనకు భోజనం పెట్టి ఆదుకున్నారట
జాతీయ అవార్డు నుంచి రాబోయే ప్రాజెక్టుల వరకు..
ఇదిలా ఉంటే.. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2', 'కై పో చే', 'క్వీన్', 'షైతాన్', 'అలీఘర్' వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్ కుమార్ రావు 'షాహిద్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ముద్దాడారు.
హీరోగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతీ పాత్రలోనూ తన నటనతో జీవించేశారు రాజ్ కుమార్. ఇటీవల సాన్యా మల్హోత్రాతో కలిసి 'టోస్టర్' చిత్రంలో మెరిసిన ఆయన, త్వరలోనే 'ప్రహార్: ది ఉజ్జ్వల్ నికమ్ స్టోరీ'తో అలరించనున్నారు.
కోర్ట్ రూమ్ డ్రామాతో
ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నికమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడి కేసులో కసబ్ విచారణ సహా పలు సంచలనాత్మక కేసుల నేపథ్యాన్ని ఇందులో చూపించనున్నారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.