90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండర్ వరల్డ్ నీడలో మగ్గిపోయేది. షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, కరణ్ జోహార్ వంటి హేమాహేమీలకు కూడా మాఫియా నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ‘యువా’ (Yuvaa) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొన్న ఒక భయానక, వింతైన అనుభవాన్ని పంచుకున్నారు. అండర్ వరల్డ్ బెదిరింపుల కారణంగా తమ ఇల్లు వదిలి ఒక రోజంతా వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.
మాఫియాతో మా పనిమనిషి వాగ్వాదం!
వరుణ్ ధావన్ ఆనాటి సంఘటనను వివరిస్తూ.. "అప్పట్లో చాలా మంది సెలబ్రిటీలకు మాఫియా కాల్స్ వచ్చేవి. మాకు కూడా చాలా కాలం నుంచి అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆ కాల్స్ ఎత్తిన మా ఇంట్లోని స్టాఫ్, అవతలి వ్యక్తి ఎవరన్నది తెలియక వారితో వాగ్వాదానికి దిగేవారు" అని వరుణ్ ధావన్ తెలిపాడు.
"‘నువ్వు ఎవడవైతే మాకేంటి? దమ్ముంటే ఆ గార్డెన్‌లోకి రా.. నిన్ను కొట్టి చూపిస్తా’ అని మా పనిమనిషి వాళ్లకు సవాల్ విసిరేవాడు. అంతేకాదు, మా ఇంటి అడ్రస్ కూడా వాళ్లకు చెప్పేసి రమ్మని పిలిచేవాడు" అని నవ్వుతూనే ఆనాటి గందరగోళాన్ని గుర్తు చేసుకున్నారు హీరో వరుణ్ ధావన్.
గన్లతో వస్తామని బెదిరింపు
అయితే ఈ విషయం ఒక స్టార్ హీరో ద్వారా దర్శకుడు డేవిడ్ ధావన్ చెవిన పడటంతో పరిస్థితి సీరియస్ అయింది. "విషయం చేజారిపోతోందని, అవతలి వ్యక్తి తుపాకులతో వస్తానని బెదిరిస్తున్నాడని మా నాన్నకు ఒక నటుడు ఫోన్ చేసి హెచ్చరించాడు" అని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు.
{{/usCountry}}అయితే ఈ విషయం ఒక స్టార్ హీరో ద్వారా దర్శకుడు డేవిడ్ ధావన్ చెవిన పడటంతో పరిస్థితి సీరియస్ అయింది. "విషయం చేజారిపోతోందని, అవతలి వ్యక్తి తుపాకులతో వస్తానని బెదిరిస్తున్నాడని మా నాన్నకు ఒక నటుడు ఫోన్ చేసి హెచ్చరించాడు" అని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు.
{{/usCountry}}"అతను మా ఆఫీస్ టైమింగ్స్, అడ్రస్ అన్నీ వాళ్లకు తెలిసిపోయాయని చెప్పాడు. దీంతో ఆ రోజు రాత్రే మేమంతా ఇల్లు వదిలి వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాము. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇది వింతగా అనిపించినా, అప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము" అని వరుణ్ ధావన్ వివరించారు.
గోలీమార్ సినిమా తరహాలో
అంటే, సేమ్ తెలుగు మూవీ గోలీమార్‌లో చూపించినట్లుగా వరుణ్ ధావన్ రియల్ జీవితంలో జరిగినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన గోలీమార్ సినిమాలో కూడా ఓనర్‌కు గ్యాంగ్‌స్టర్ కాల్ చేస్తే ఇంటి పనిమనిషి రెచ్చగొట్టే సన్నివేశం గుర్తుండే ఉంటుంది. దాదాపుగా అలానే హీరో వరుణ్ ధావన్ రియల్ లైఫ్‌లో జరిగిందని ఈ సంఘనటతో అర్థమవుతోంది.
వరుణ్ ధావన్ సినిమా విశేషాలు
వరుణ్ ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్ వంటి తారలతో కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 20న నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.
యశ్ టాక్సిక్ కారణంగా
ప్రస్తుతం తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదల కోసం వరుణ్ ధావన్ ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను ముందుగా జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు ఉంది. కానీ, యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా జూన్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.