నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన 'మిసెస్' సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరోయిన్ సాన్య మల్హోత్రా జీవితంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ముంబై నగరంలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు సాన్య. తాజాగా సాన్య మల్హోత్రా కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.
గృహ ప్రవేశ వేడుక

ఈ క్రమంలో తన కొత్త ఇంటిలోకి సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశ వేడుకతో అడుగుపెట్టారు. దీంతో సాన్య మల్హోత్రా గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
కళ్లకు కట్టేలా కొత్త ఇల్లు
సాన్య మల్హోత్రా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె ఇల్లు అత్యంత విలాసవంతంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇంటి నుంచి అరేబియా సముద్ర అందాలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. అంటే సీ వ్యూతో సాన్య మల్హోత్రా తన ఇంటి కలను నిజం చేసుకున్నారు.
ఇంటి నిండా ధారాళంగా వెలుతురు వచ్చేలా కిటికీలు, ఆధునిక హంగులతో కూడిన ఇంటీరియర్ ఆకట్టుకుంటున్నాయి. గృహప్రవేశ పూజలో భాగంగా సాన్యా పింక్ కలర్ చీర ధరించి, తలపై కలశం పెట్టుకుని శాస్త్రోక్తంగా ఇంట్లోకి అడుగుపెట్టారు.
ఓర్పుకు దక్కిన ఫలితం: సాన్య భావోద్వేగం
తన కొత్త ఇంటి గురించి సాన్యా ఎమోషనల్ నోట్ రాశారు. "హర హర మహాదేవ్.. ఎన్నో ఏళ్ల కలలు, కష్టం, ఎదుగుదలకు ప్రతిరూపం ఈ ఇల్లు. ఓర్పు, నమ్మకం ఉంటే ఫలితం ఎంత అందంగా ఉంటుందో ఈ ఇంటి ప్రతి గోడ నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది" అని సాన్య మల్హోత్రా రాసుకొచ్చారు.
"ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు చూపిన నమ్మకమే నాకు కొండంత అండ. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, నా జీవిత ప్రయాణంలో ఒక భాగం. వెల్కమ్ టు మై ఘర్" అని సాన్య మల్హోత్రా పేర్కొన్నారు.
{{/usCountry}}"ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు చూపిన నమ్మకమే నాకు కొండంత అండ. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, నా జీవిత ప్రయాణంలో ఒక భాగం. వెల్కమ్ టు మై ఘర్" అని సాన్య మల్హోత్రా పేర్కొన్నారు.
{{/usCountry}}సాన్య పోస్ట్‌పై బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, శ్వేతా త్రిపాఠి, పుల్కిత్ సామ్రాట్ వంటి సినీ ప్రముఖులు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సాన్య మల్హోత్రా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని స్నేహితులు ప్రశంసించారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మూవీ
ఇదిలా ఉంటే, వృత్తిపరంగా కూడా సాన్య మల్హోత్రా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవల వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌లతో కలిసి 'సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి'లో కనిపించిన ఆమె, త్వరలో రాజ్‌కుమార్ రావుతో కలిసి 'టోస్టర్' అనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒరిజినల్ మూవీలో నటించనున్నారు.
న్యాయ వ్యవస్థలోని లోపాలను
దీనితో పాటు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బందర్' సినిమాలోనూ సాన్య మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే కథాంశంతో రానుంది.
సాన్య మల్హోత్రా ఓటీటీ సినిమాలు
ఇదిలా ఉంటే ఓటీటీ హీరోయిన్‌గా సాన్య మల్హోత్రా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మిసెస్ (జీ5 ఓటీటీ), కథల్ (నెట్‌ఫ్లిక్స్), పాగ్లైట్ (నెట్‌ఫ్లిక్స్), లవ్ హాస్టల్ (జీ5 ఓటీటీ), మీనాక్షి సుందరేశ్వర్ (నెట్‌ఫ్లిక్స్) వంటి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బాగా క్లిక్ అయ్యారు దంగల్ బ్యూటీ సాన్య మల్హోత్రా.