థియేటర్లలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఒకే రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. ఒకటి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ కాగా, మరొకటి హారర్ థ్రిల్లర్ శంబాల, ఇంకోటి సోషల్ డ్రామా దండోరా. ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ లపై ఓ లుక్కేయండి.
ఛాంపియన్ ఓటీటీ

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ఛాంపియన్. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలోని స్పోర్ట్స్ స్టోరీగా ఛాంపియన్ మూవీ రిలీజైంది. డిసెంబర్ 25న ఇది థియేటర్లకు వచ్చింది.
ఛాంపియన్ మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టీవీలో అయితే జీ తెలుగులో రానుంది. ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా నాలుగు వారాల విండో తర్వాత ఛాంపియన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
శంబాల ఓటీటీ
ఆది సాయి కుమార్ ఓ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడైన ఆదికి శంబాలతో హిట్ దక్కినట్లే కనిపిస్తోంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా శంబాల తెరకెక్కింది. ఈ మూవీ కూడా గురువారం రిలీజైంది.
శంబాల సినిమా ఓటీటీ రైట్స్ ను ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
దండోరా ఓటీటీ
శివాజీ కాంట్రవర్సీ కామెంట్లు ఇంకా ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ కామెంట్లు దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లోనే చేశారు. ఇలా దండోరా సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. గురువారం థియేటర్లకు వచ్చిన ఈ సోషల్ డ్రామా దండోరా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో శివాజీ, బిందు మాధవి, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}శివాజీ కాంట్రవర్సీ కామెంట్లు ఇంకా ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ కామెంట్లు దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లోనే చేశారు. ఇలా దండోరా సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. గురువారం థియేటర్లకు వచ్చిన ఈ సోషల్ డ్రామా దండోరా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో శివాజీ, బిందు మాధవి, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}దండోరా సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కైవసం చేసుకుంది. ఈ సోషల్ డ్రామా నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. అంటే ఛాంపియన్, దండోరా, శంబాల సినిమాలు జనవరి 20 నుంచి 28 మధ్య ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.