మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆ కోవలోనే జనవరి 22న విడుదలైన లేటెస్ట్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే ‘చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ (Chatha Pacha). చథా పచ్చ అంటే మలయాళంలో డూ ఆర్ డై అనే మీనింగ్ వస్తుంది.
ఓటీటీలోకి ఇవాళ

రోషన్ మాథ్యూ, అర్జున్ అశోకన్, విశాఖ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా చథా పచ్చ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 19) వచ్చేసింది. జనవరి 22న మలయాళంలో రిలీజ్ అయిన చథా పచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 90వ దశకంలో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)ని పిచ్చిగా ప్రేమించిన వారికి ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్‌లా అనిపించింది.
రూ. 31 కోట్ల కలెక్షన్స్
థియేటర్లలో విడుదలైన చథా పచ్చ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 31.05 కోట్లు రాబట్టింది. అలాగే, ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు పదికి 7 రేటింగ్ వచ్చింది. భిన్నాభిప్రాయాలతో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కేమియో రోల్ అందరిని సర్‌ప్రైజ్ చేసింది. దీంతో ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది.
ఇక తాజాగా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది చథా పచ్చ సినిమా. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ చథా పచ్చ ది రింగ్ ఆఫ్ రౌడీస్ ఓటీటీ రిలీజ్ అయింది. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ వంటి ఐదు భాషల్లో చథా పచ్చ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
WWE నేపథ్యం.. చథా పచ్చ రివ్యూ
థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చథా పచ్చ సినిమా చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, థియేట్రికల్ రిలీజ్ సమయంలో చథా పచ్చ ది కింగ్ ఆఫ్ రౌడీస్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా రివ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చథా పచ్చ సినిమా చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, థియేట్రికల్ రిలీజ్ సమయంలో చథా పచ్చ ది కింగ్ ఆఫ్ రౌడీస్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా రివ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}చథా పచ్చ గురించి నెటిజన్లు ప్రధానంగా చర్చించుకున్న అంశం టెక్నికల్ వాల్యూస్. "భారతదేశంలో కుస్తీ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. 90స్ కిడ్స్‌కు ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ప్రయాణం" అని ఒక యూజర్ పేర్కొన్నారు. సినిమాలో చూపించిన రెజ్లింగ్ మూవ్స్ చాలా సహజంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసించారు.
మమ్ముట్టి ఎంట్రీతో కేక.. కానీ?
మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్రలో మెరిశారు. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లలో ఈలలు, గోలలతో దద్దరిల్లింది. "ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది, మమ్ముక్కా ఇంట్రో సీన్ హైలైట్" అని కొందరు ఫ్యాన్స్ ఖుషీ అయితే.. మరికొందరు మాత్రం "ఆయన పాత్రకు అంత ఇంపాక్ట్ లేదు, కేవలం హైప్ కోసం వాడుకున్నారు" అని పెదవి విరిచారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
బాలీవుడ్ దిగ్గజ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టారు. పాటలు పర్వాలేదనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని నెటిజన్లు చెప్పారు. ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చథా పచ్చ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఎంచక్కా చూసేయండి.