...
...
Next Story

OTT Telugu: ఓటీటీలో వణుకుపుట్టిస్తున్న హిస్టారికల్ థ్రిల్లర్- భయంకరమైన వాస్తవ ఘటన కథతో- 9.3 ఐఎమ్‌డీబీ రేటింగ్- తెలుగులో!

Real Incident Based Chernobyl OTT Streaming Telugu: ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అణు ప్రమాదం ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ చేర్నోబిల్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. 9.3 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో మైండ్ బ్లాక్ చేసే ఈ హిస్టారికల్ థ్రిల్లర్ తెలుగులో ఉంది. చెర్నోబిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Sep 28, 2026, 09:27:28 IST
Advertisement

Real Incident Based Chernobyl OTT Release Telugu: ఓటీటీ వేదికలపై క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, రొమాన్స్ చిత్రాలకు కొదవే లేదు. అయితే సమాజంలో జరిగిన నిజమైన సంఘటనలు, హిస్టారికల్ ఈవెంట్స్ ఆధారంగా వచ్చే సిరీస్‌లు కలిగించే అనుభూతి వేరు.

వణుకుపుట్టించే థ్రిల్లర్ సిరీస్

ఓటీటీలో వణుకుపుట్టిస్తున్న హిస్టారికల్ థ్రిల్లర్- భయంకరమైన వాస్తవ ఘటన కథతో- 9.3 ఐఎమ్‌డీబీ రేటింగ్- తెలుగులో!
ఓటీటీలో వణుకుపుట్టిస్తున్న హిస్టారికల్ థ్రిల్లర్- భయంకరమైన వాస్తవ ఘటన కథతో- 9.3 ఐఎమ్‌డీబీ రేటింగ్- తెలుగులో!

అలాంటి ఒక అద్భుతమైన, వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'చేర్నోబిల్' (Chernobyl). 2019లో విడుదలైన ఈ మైండ్ బ్లోయింగ్ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎమ్‌డీబీ (IMDb) వేదికపై ఈ సిరీస్ ఏకంగా 9.3/10 రేటింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక సాధారణ డ్రామా సిరీస్‌గా కాకుండా, మానవాళి చరిత్రలో చోటుచేసుకున్న అతిపెద్ద మానవ తప్పిదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు వీక్షకులను ఆశ్చర్యపరిచింది.

అసలు ఆ రాత్రి ఏం జరిగింది?

1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత ఉక్రెయిన్) లోని చేర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది. ప్లాంట్‌లోని యూనిట్ 4 RBMK రియాక్టర్‌లో తక్కువ విద్యుత్ సామర్థ్యంతో సేఫ్టీ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో నియంత్రణ తప్పి తీవ్రమైన పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ధాటికి రియాక్టర్ భవనం తీవ్రంగా ధ్వంసమై, వాతావరణంలోకి అధిక పరిమాణంలో రేడియోధార్మిక పదార్థాలు (రేడియేషన్) విరజిమ్మి పడ్డాయి. ఈ ప్రమాదానికి రియాక్టర్ డిజైన్‌లోని లోపాలు, సిబ్బంది భద్రతా నియమాలను విస్మరించడం, ఆ సమయంలో పాలకులు ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యమే ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ సంచలనాత్మక సిరీస్‌ను క్రియేటర్ క్రెగ్ మేజిన్ (Craig Mazin) అద్భుతంగా రచించగా, జోహాన్ రెంక్ (Johan Renck) దర్శకత్వం వహించారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, విపత్తు తీవ్రతను దాచేందుకు పాలకులు చేసిన ప్రయత్నాలు, సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి పోరాడిన శాస్త్రవేత్తల పాత్రలను అత్యంత సహజంగా తెరకెక్కించారు.

ప్రధాన పాత్రల్లో జారెడ్ హ్యారిస్ (Jared Harris), స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ (Stellan Skarsgård), ఎమిలీ వాట్సన్ (Emily Watson) తమ నటనతో ప్రాణం పోశారు. అణు శాస్త్రవేత్త వాలెరీ లెగాసోవ్‌గా జారెడ్ హ్యారిస్ అద్భుతమైన హావభావాలు పండించారు. విపత్తు జరిగిన ప్రదేశంలో భయానక వాతావరణాన్ని, రేడియేషన్ ప్రభావంతో నరకయాతన అనుభవించిన బాధితుల పరిస్థితిని చూపిస్తూ ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠను నింపారు.

ఎందుకు చూడాలి?

నిజమైన కథలు, చారిత్రాత్మక ఘట్టాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన మాస్టర్‌పీస్ ఇది. కేవలం 5 ఎపిసోడ్‌లతో సాగే ఈ మిని సిరీస్ వీక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న చెర్నోబిల్ ఓటీటీలో ఇప్పటికీ అదరగొడుతోంది.

చెర్నోబిల్ ఓటీటీ స్ట్రీమింగ్

జియో హాట్‌స్టార్ (JioHotstar) చెర్నోబిల్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి 5 భాషల్లో జియోహాట్‌స్టార్‌లో చెర్నోబిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి జియో హాట్‌స్టార్ లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ అద్భుతమైన సిరీస్‌ను ఎంచక్కా వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks