Chumbak OTT Streaming Trailer Released: కాలనీల్లో ఉండే ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, చిన్న విషయానికే పెద్ద రచ్చ చేసే అలవాట్లు, ఎంత గొడవపడినా కష్టమొస్తే ఒకరికొకరు నిలబడే బంధాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త ఓటీటీ ఫ్యామిలీ కామెడీ సిరీస్ 'చుంబక్' (Chumbak).
చుంబక్ ట్రైలర్ రిలీజ్

తాజాగా ఈ ఓటీటీ సిరీస్ చుంబక్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేశారు. తెలుగులో 'అమృతం' లాంటి కాలనీ కామెడీలు, మధ్యతరగతి మనుషుల ఎమోషన్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా అదే తరహాలో ప్రతీ ఇంటా జరిగే హడావుడిని, ఇరుగుపొరుగు మనుషుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాలను ఆవిష్కరిస్తూ ఈ సిరీస్‌ను మలిచారు.
చిన్న గొడవ.. కాలనీ అంతా హంగామా!
మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కాలనీ మొత్తం క్షణాల్లో వ్యాపించడం, అనవసర సలహాలు ఇచ్చేందుకు పక్కింటి వాళ్లు సిద్ధంగా ఉండటం భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగం. 'చుంబక్' కథాంశం కూడా ఇలాంటి వాతావరణంలోనే సాగుతుంది.
ఎవరెవరు ఎలా?
బుల్లితెర స్టార్ హీరో అర్జున్ బిజ్లానీ, హెల్లీ షా జంట కాస్త డ్రీమీ లవర్స్‌గా అలరిస్తుండగా, సుమీత్ వ్యాస్, మానసి పారేఖ్ దంపతుల మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ డ్రామా ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి నీనా గుప్తా, దేవన్ భోజానీ కాంబినేషన్‌లో వచ్చే దంపతుల గిల్లికజ్జాలు, డెల్నాజ్ ఇరానీ కుటుంబం చేసే రచ్చ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఖిచ్డీ మేకర్స్ నుంచి వస్తున్న మరో నవ్వుల విందు
'ఖిచ్డీ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి ఎవర్ గ్రీన్ టీవీ కామెడీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హ్యాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ ఓటీటీ సిరీస్‌ను నిర్మించింది. ఆతిష్ కపాడియా రచన, దర్శకత్వంలో జమ్నాదాస్ (జెడి) మజేతియా, ఆతిష్ కపాడియా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
చుంబక్ నటీనటులు
{{/usCountry}}'ఖిచ్డీ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి ఎవర్ గ్రీన్ టీవీ కామెడీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హ్యాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ ఓటీటీ సిరీస్‌ను నిర్మించింది. ఆతిష్ కపాడియా రచన, దర్శకత్వంలో జమ్నాదాస్ (జెడి) మజేతియా, ఆతిష్ కపాడియా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
చుంబక్ నటీనటులు
{{/usCountry}}ఈ చుంబక్ ఓటీటీ సిరీస్‌లో నీనా గుప్తా, దేవన్ భోజానీ, సుమీత్ వ్యాస్, అర్జున్ బిజ్లానీ, సుమీత్ రాఘవన్, అమీరా దస్తూర్ లాంటి దిగ్గజాలు నటించారు. ఇలాంటి చుంబక్ ఓటీటీలోకి వచ్చేయనుంది. సెప్టెంబర్ 10 నుంచి చుంబక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
చుంబక్ ఓటీటీ స్ట్రీమింగ్
డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 10న ఈ చుంబక్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియా హెడ్ తాన్యా బామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కుటుంబాలన్నీ నవ్వుకునే కథలకు
"కుటుంబాలన్నీ కలిసి చూసి నవ్వుకునే కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మన పక్క ఇంట్లో లేదా మన ఇంట్లో రోజూ చూసే పాత్రల ఆధారంగా 'చుంబక్' సిరీస్‌ను తెరకెక్కించారు" అని తాన్యా బామి తెలిపారు.
చుంబక్‌పై నిర్మాతల కామెంట్స్
"ఏ రోజూ ఏ విషయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోలేని (దాగని సీక్రెట్స్) ఒక కాలనీ కథే 'చుంబక్'. ఎంత గొడవలు పడినా చివరికి ఇరుగుపొరుగు వారే ఒక కుటుంబంలా మారతారు. ప్రతీ ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను, కాలనీ రోజులను గుర్తుచేసుకునేలా ఈ సిరీస్ ఉంటుంది" అని నిర్మాతలు జెడి మజేతియా, ఆతిష్ కపాడియా పేర్కొన్నారు.