Sree Vishnu Comrade Kalyan OTT Streaming: వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంతోపాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ప్రయోగాత్మక చిత్రాలకు వినోదాన్ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో మంచి క్రెజ్ తెచ్చుకున్నాడు.
నిన్న థియేటర్లలో రిలీజ్

అలాంటి శ్రీవిష్ణు నుంచి ఓ సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్‌పై మంచి ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి. ఈ అంచనాల నడుమ తాజాగా నిన్న అంటే అక్టోబర్ 9న థియేటర్లలో కామ్రేడ్ కళ్యాణ్ సినిమా విడుదలైంది.
కామెడీ, విప్లవాత్మక అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా చేసింది. హీరో తల్లిగా కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ నటించారు.
కామ్రెడ్ కళ్యాణ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
వీరితోపాటు మలయాళ పాపులర్ నటుడు, దసరా విలన్ షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సత్య, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ పతాకంపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని నిర్మించారు.
అయితే, కామ్రేడ్ కళ్యాణ్ సినిమా తొలి రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్లలో నవ్వులు పూయిస్తోందని టాక్ వినిపిస్తోంది. నక్సలిజం కాన్సెప్ట్‌కు కామెడీని అద్ది అందరికి అర్థమయ్యేలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమాను తెరకెక్కించినట్లు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి.
థియేటర్ ఓనర్ నుంచి మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా..!
{{/usCountry}}అయితే, కామ్రేడ్ కళ్యాణ్ సినిమా తొలి రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్లలో నవ్వులు పూయిస్తోందని టాక్ వినిపిస్తోంది. నక్సలిజం కాన్సెప్ట్‌కు కామెడీని అద్ది అందరికి అర్థమయ్యేలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమాను తెరకెక్కించినట్లు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి.
థియేటర్ ఓనర్ నుంచి మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా..!
{{/usCountry}}ఈ సినిమాలో కళ్యాణ్ అనే సరదా కుర్రాడి పాత్రలో శ్రీ విష్ణు నటించారు. ఊరిలో ఒక టాకీస్ నడుపుకుంటూ కాలం గడిపే కళ్యాణ్ తల్లి నందమూరి బాలకృష్ణకు విపరీతమైన అభిమాని. జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, ఒడిశాకు చెందిన ఒక అమ్మాయితో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. భాష వేరైనా వారి ప్రేమాయణం ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది.
కళ్యాణ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతారు. అతడు ఒక సామాన్య థియేటర్ నడిపే వ్యక్తి కాదని, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ జాబితాలో ఉన్నాడని తెలిసి అందరూ షాక్ అవుతారు. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించుకునేందుకు కళ్యాణ్ తన గ్యాంగ్‌తో కలిసి ఒక రాజకీయ నాయకుడిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత పరిణామాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనేదే మిగతా కథ.
కామ్రెడ్ కళ్యాణ్ ఓటీటీ స్ట్రీమింగ్- టీవీ ప్రీమియర్
ఇకపోతే కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం. అంటే, అమెజాన్ ప్రైమ్‌లో కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట. అంతేకాకుండా హిందీ మినహా మిగతా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి 4 భాషల్లో కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్ రానుందని టాక్. అలాగే, మరోవైపు కామ్రెడ్ కళ్యాణ్ శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ 'స్టార్ మా' దక్కించుకుంది. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఓటీటీ తర్వాత స్టార్ మా బుల్లితెరపై కామ్రేడ్ కళ్యాణ్ టీవీ ప్రీమియర్ కానుందన్నమాట.