...
...
Next Story

OTT Crime: ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ క్రైమ్ కామెడీ మూవీ- 9.1 రేటింగ్- ప్రింటర్ నొక్కితే బయటపడే నోట్ల కట్టలు- ఎక్కడంటే?

Con City OTT Streaming: విలక్షణమైన గొంతుతో మెప్పించే అర్జున్ దాస్, ప్రతిభావంతురాలైన నటి అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు ఫ్యామిలీ క్రైమ్ కామెడీ చిత్రం కాన్ సిటీ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్ తెచ్చుకున్న కాన్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 7, 2026, 05:32:34 IST
Advertisement

Con City OTT Release: తన విలక్షణమైన గంభీరమైన వాయిస్‌తో, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్ యాక్టర్, ఓజీ ఫేమ్ అర్జున్ దాస్. ఆయన హీరోగా.. మలయాళ బ్యూటీ, కల్కి 2898 ఏడీ నటి అన్నా బెన్ హీరోయిన్‌గా నటించిన సరికొత్త తెలుగు, తమిళ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ చిత్రం 'కాన్ సిటీ' (Con City).

కాన్ సిటీ ఐఎమ్‌డీబీ రేటింగ్

ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ క్రైమ్ కామెడీ మూవీ- 9.1 రేటింగ్- ప్రింటర్ నొక్కితే బయటపడే నోట్ల కట్టలు- ఎక్కడంటే?
ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ క్రైమ్ కామెడీ మూవీ- 9.1 రేటింగ్- ప్రింటర్ నొక్కితే బయటపడే నోట్ల కట్టలు- ఎక్కడంటే?

జూన్ 26న థియేటర్లలోకి వచ్చిన కాన్ సిటీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకున్న కాన్ సిటీ మూవీకి హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న కాన్ సిటీ ఓటీటీలోకి వచ్చేయనుంది.

తెలుగు హీరోయిన్ కీలక పాత్ర

టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ సాక్షి వైద్య ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, వారికి దివ్యాంగుడైన కుమారుడు ఉంటారు. వారితోపాటే హీరోయిన్ తల్లి, అన్న కూడా జీవిస్తుంటారు. అంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు.

ప్రింటర్ నుంచి 500 నోటు

అయితే, వీరంతా డబ్బుల కోసం రకరకాల స్కామ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో విలన్‌కు హీరో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. కానీ, డబ్బు ఉండదు. ఆ ఫ్రస్టేషన్‌లో తన దగ్గర ఉన్న ప్రింటర్‌ను పగలగొట్టబోతుంటే బటన్ ప్రెస్ అయి రూ. 500 నోటు బయటపడుతుంది. అలా బటన్ నొక్కడంతో డబ్బుల వరద కురుస్తూనే ఉంటుంది.

కనిపించకుండా పోయే మేషిన్

ఆఖరికి ఆ మేషిన్‌ను డాబా పైనా గన్‌లా ఫీల్ అవుతూ ఫైర్ చేస్తుంటాడు దివ్యాంగుడైన కొడుకు. కానీ, దాని నుంచి 500 నోట్ల కట్టలు ఆ ఏరియా అంతా పడిపోతాయి. వాటిని తీసుకునేందుకు చుట్టుపక్కల జనమంతా ఎగబడాతరు. అది చూసి ఆ స్కామ్ ఫ్యామిలీ కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే కాన్ సిటీ సినిమా కథ.

కాన్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కాన్ సిటీ ఓటీటీలోకి వచ్చేయనుంది. కాన్ సిటీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కాన్ సిటీ ఓటీటీ రిలీజ్ కానుంది. జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కాన్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

తెలుగు, తమిళ భాషల్లో కాన్ సిటీ ఓటీటీలోకి రానుంది. కామెడీతో సాగే మంచి థ్రిల్లింగ్ హీస్ట్ క్రైమ్ సినిమాను చూడాలనుకునేవారు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్న కాన్ సిటీపై లుక్కేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks