OTT: ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్- కేవలం 40 నిమిషాల రన్ టైమ్, 7.5 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
Copy OTT Streaming: ఓటీటీలో తక్కువ సమయంలో ఒక మంచి సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'కాపీ' బెస్ట్ ఛాయిస్. విక్రాంత్ మాస్సే, సుర్వీన్ చావ్లా, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది. ఇలాంటి కాపీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Vikrant Massey Copy OTT Release: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మనదగ్గర కోకొల్లలు. అయితే బిజీ లైఫ్ వల్ల గంటల తరబడి వెచ్చించి ఓటీటీ వెబ్ సిరీస్‌లు లేదా ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలను చూడటానికి సమయం దొరకని వారు చాలా మందే ఉంటారు.

మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్
అలాంటి వారి కోసం కేవలం 40 నిమిషాల నిడివితో ఉత్కంఠ రేకెత్తించే ఒక అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 2018లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ లఘు చిత్రం ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
'12త్ ఫెయిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతో దగ్గరైన నటుడు విక్రాంత్ మాస్సే, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రమే 'కాపీ'. ఈ సినిమాకు మరో ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
ఎస్.జె.సూర్య సినిమాకు రీమేక్
వైవిధ్యమైన నటనతో టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎస్.జె. సూర్య హీరోగా 2007లో తమిళంలో వచ్చిన 'వ్యాపారి' చిత్రానికి ఇది రీమేక్ అని ఒక టాక్ ఉంది. ఈ హిందీ వెర్షన్‌ను ప్రముఖ దర్శకుడు అరిందమ్ సిల్ తెరకెక్కించారు.
బాలీవుడ్ స్టార్ రైటర్, 'కహానీ' చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్‌తో పాటు తానియా భట్టాచార్య, రాజ్ వసంత కాపీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. విక్రాంత్ మాస్సే (సిద్ధార్థ్), సుర్వీన్ చావ్లా (మమత) లతో పాటు అనుప్రియ గోయెంకా (సిమోనా), అక్షయ్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. కేవలం రెండు మూడు లొకేషన్లలోనే దర్శకుడు ఈ కథను ఎంతో పకడ్బందీగా నడిపించారు.
ఇంతకీ కథేంటంటే?
కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ (విక్రాంత్ మాస్సే) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అహంకారి. ఎప్పుడూ చిరాకు పడుతూ భార్యతో, ఆఫీస్ సిబ్బందితో ఎంతో కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. అందరిపై తన అధికారాన్ని చెలాయించడం అతనికి అలవాటు.
ఇటు సంసార జీవితం, అటు ఆఫీస్ ఒత్తిడితో పాటు సిమోనా (అనుప్రియ గోయెంకా) అనే అమ్మాయితో సిద్ధార్థ్‌కి వివాహేతర సంబంధం కూడా ఉంటుంది. ఈ మూడు విషయాలను బ్యాలెన్స్ చేయడం సిద్ధార్థ్‌కు సాధ్యం కాదు. దీనికోసం అతడు ఒక వినూత్నమైన ఆలోచన చేస్తాడు. సైన్స్ టెక్నాలజీ సాయంతో అచ్చం తనలాగే కనిపించే, తనలాగే మాట్లాడే ఒక హ్యూమనాయిడ్ రోబోను కొంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే అసలు కథ.
కాపీ ఐఎమ్‌డీబీ రేటింగ్
అతి తక్కువ రన్ టైమ్ ఉన్నప్పటికీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సైన్స్ ఫిక్షన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. కాపీ మూవీకి ఐఎమ్‌డీబీ (IMDb)లో పదికి 7.5 రేటింగ్ ఉంది. ఇలాంటి కాపీ ఓటీటీలో సందడి చేస్తోంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో కాపీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండే విభిన్నమైన సినిమా చూడాలనుకునేవారు హాట్‌స్టార్ ఓటీటీలోని కాపీ మూవీని ఎంచక్కా వాచ్ చేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


