Cousins and Kalyanams OTT Release Telugu: ఒక్క కన్నుగీటు వీడియోతో దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన 'ఒరు అదార్ లవ్' తెలుగులో (లవర్స్ డే టైటిల్) సినిమాలోని ఆ ఒక్క సీన్ ఆమె లైఫ్‌ను మార్చేసింది. ఆ సినిమాలో ప్రియాతో కలిసి నటించిన రోషన్ అబ్దుల్ రహూఫ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మలయాళ ఓటీటీ సిరీస్

ఇప్పుడు ఈ క్రేజీ జోడీ ఓటీటీ స్క్రీన్‌పై కనువిందు చేసేందుకు రెడీ అయింది . వీరిద్దరి కాంబినేషన్‌లో సరికొత్త మలయాళ ఓటీటీ వెబ్ సిరీస్ 'కజిన్స్ అండ్ కల్యాణమ్స్' (Cousins and Kalyanams) డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఒక లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అటు మాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.
ఆరుగురు కజిన్ల కథ.. ఏడు పెళ్లిళ్ల హంగామా
ఈ ఓటీటీ సిరీస్‌ను ఒక స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రంగా మలిచారు. హాస్యం, బంధాలు, భావోద్వేగాల కలబోతగా ఈ ఓటీటీ సిరీస్ కథ సాగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కజిన్స్ (సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు) చుట్టూ ఈ ఓటీటీ సిరీస్ తిరుగుతుంది. వారంతా తమ జీవితాల్లోని విభిన్న దశలను దాటుకుంటూ.. కుటుంబంలో జరిగే వేడుకల ద్వారా ఎలా ఒకతాటిపైకి వచ్చారనేదే అసలు కథ.
ఈ సిరీస్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కథ మొత్తం ఏడు పెళ్లిళ్ల నేపథ్యంలో సాగుతుంది. ప్రతి పెళ్లి వేడుక కథలో ఒక కొత్త మలుపునకు దారితీస్తుంది. ఈ ప్రయాణంలో వారి మధ్య ఉన్న బంధాలకు ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? పాత స్నేహాలు ఎలా బలపడ్డాయి? మనసుల్లో దాచుకున్న ప్రేమ భావాలు ఎలా బయటపడ్డాయి? అనే విషయాలను దర్శకులు చాలా వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించనున్నారు.
టీజర్‌కు రెస్పాన్స్ అదుర్స్.. ఫ్యాన్స్ డిమాండ్!
ఇటీవలే విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ కజిన్స్ అండ్ కల్యాణమ్స్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రియా ప్రకాష్, రోషన్ జంటను మళ్లీ చూడటం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పాత ఇష్యూస్ గురించి కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
{{/usCountry}}ఇటీవలే విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ కజిన్స్ అండ్ కల్యాణమ్స్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రియా ప్రకాష్, రోషన్ జంటను మళ్లీ చూడటం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పాత ఇష్యూస్ గురించి కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
{{/usCountry}}"దయచేసి జియో హాట్‌స్టార్‌లో నిలిచిపోయిన 'ఏదో జన్మ కల్పనయిల్' ఎపిసోడ్‌లను తిరిగి తీసుకురండి.. చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఆ సీరియల్ చూడటానికి జియో హాట్‌స్టార్ ఏకైక మార్గమని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
మే 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్
ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ (JioHotstar) అధికారికంగా ప్రకటించింది. మే 29 నుంచి జియో హాట్‌స్టార్‌లో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మరో నాలుగు రోజుల్లో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.
తెలుగులోనూ రిలీజ్
విష్ణు చంద్రన్, కణ్ణన్ తామరక్కులమ్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొత్తం 60 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌కు సంబంధించి.. ప్రతి శుక్రవారం నాలుగు కొత్త ఎపిసోడ్‌లను విడుదల చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లోనూ హాట్‌స్టార్ ఓటీటీలో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ అందుబాటులోకి రానుందని సమాచారం.