Vishwak Sen Cult OTT Streaming Today: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తెలుగు స్లాషర్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'కల్ట్' (Cult). అయితే, అనుకున్న సమయం కంటే ముందే కల్ట్ ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 19) వచ్చేసింది.
20 రోజుల్లోనే ఓటీటీలోకి కల్ట్

అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ #కల్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనల కారణంగా మోస్తరు వసూళ్లను మాత్రమే రాబట్టింది. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్ల నుంచి ఓటీటీలోకి రావడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుంది. కానీ 'కల్ట్' చిత్రం థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
అసలు 'కల్ట్' కథ ఏమిటంటే?
భారతదేశంలోనే తొలి స్లాషర్ థ్రిల్లర్‌గా చిత్రబృందం ప్రచారం చేసిన 'కల్ట్' కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలుగు తెరపై అరుదుగా కనిపించే ఈ జోనర్‌లో హింసాత్మక ఘటనలు, ప్రాణాలు కాపాడుకునే పోరాటం (సర్వైవల్ ఎలిమెంట్స్) ప్రధానాంశాలుగా ఉన్నాయి.
గోవా హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకలను అత్యంత విలాసవంతంగా ఏర్పాటు చేస్తాడు. ఈ పార్టీకి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఆటపాటలతో సరదాగా మొదలైన ఆ వేడుక కాస్తా, అకస్మాత్తుగా వరుస హత్యలు జరగడంతో పీడకలగా మారుతుంది.
ప్రాణాంతక గేమ్స్, మనుషుల ప్రాణాలతో చెలగాటం
పార్టీ జరుగుతున్న వేదిక చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చినట్లు బయటపడటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంటుంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులకు కూడా పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి.
{{/usCountry}}పార్టీ జరుగుతున్న వేదిక చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చినట్లు బయటపడటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంటుంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులకు కూడా పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి.
{{/usCountry}}ఆ పార్టీలో ఉన్న డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో రంగంలోకి దిగుతాడు. అతిథుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన ఎలాంటి సాహసాలు చేశాడనేదే ఈ సినిమా కథాంశం. స్క్విడ్ గేమ్ తరహాలో ప్రాణాంతక గేమ్స్‌తో మనుషులను చంపడం, దాన్ని రన్ చేస్తున్న వారినుంచి బాధితులను కాపాడటం వంటి అంశాలు సినిమాను చూసేలా చేస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల బలం
ఇక కల్ట్ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్ర పోషించగా, ఆయనకు జోడీగా గాయత్రీ భరద్వాజ్ నటించారు. వీరితో పాటు తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రజ్ఞ కీలక పాత్రల్లో కనిపించారు. కొత్త నటీనటులతో కలుపుకొని దాదాపు 100 మంది ఈ సినిమాలో భాగం కావడం విశేషం.
'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' సినిమాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం ఇది. రచన, దర్శకత్వ బాధ్యతలను ఆయనే స్వయంగా నిర్వహించారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన సంభాషణలు అందించారు.
కల్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్ సంగీతం, బీజీఎమ్ ఈ థ్రిల్లర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బ్లాక్‌బస్టర్ 'యానిమల్' సినిమాకు పనిచేసిన సచిన్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ అందించారు. ఇలాంటి కల్ట్ ఇవాళ సడెన్‌గా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓటీటీ రిలీజ్ అయింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో కల్ట్ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో కల్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులకు, ఇంట్లోనే కూర్చుని థ్రిల్లర్ సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు.