టైటిల్: డెకాయిట్

నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అతుల్ కులకర్ణి, వైభవ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే: అడివి శేష్
దర్శకత్వం: షానియల్ డియో
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్
విడుదల తేది: 10 ఏప్రిల్ 2026
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి, హిట్ ది సెకండ్ కేస్ వంటి థ్రిల్లర్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అడివి శేష్ మేజర్ మూవీతో అంతర్జాతీయంగా హిట్ కొట్టాడు. ఇప్పుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్.
సౌత్, బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డెకాయిట్‌లో అడివి శేష్‌తో జోడీ కట్టింది. ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించగా.. కథ, స్క్రీన్ ప్లేను అడివి శేష్ అందించడం విశేషం. అలాగే, డెకాయిట్ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. దాంతో డెకాయిట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంచనాల నేపథ్యంలో లవ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా నేడు (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో? నెటి డెకాయిట్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హరిదాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, అనూహ్యంగా హరిదాస్ 13 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అందుకు కారణం తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి కావడంతో పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు.
{{/usCountry}}హరిదాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, అనూహ్యంగా హరిదాస్ 13 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అందుకు కారణం తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి కావడంతో పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు.
{{/usCountry}}ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకున్న హరిదాస్ తాను దుబాయ్ వెళ్లేందుకు రూ. 60 లక్షలు అవసరం అవుతుంది. మరోవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భర్త భాస్కర్ (వైభవ్)కు భార్యగా సరస్వతి ఉంటుంది. సరస్వతికి రూ. 1 కోటి అవసరం పడుతుంది. హరిదాస్, సరస్వతి ఇద్దరు కలిసి భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. డబ్బు కొట్టేసి జూలియట్‌ను పోలీసులకు ఇరికించాలన్నది హరిదాస్ ప్లాన్.
మరి హరిదాస్ ప్లాన్ వర్కౌట్ అయిందా? సరస్వతిపై హరికి ఉన్న పగ ఏంటీ? ఎంతో ప్రేమించిన హరిని జూలియట్ ఎందుకు జైలుకు పంపించింది? సీఐ స్వామి అలియాస్ రాంబాబు (అనురాగ్ కశ్యప్), కరుణ హాస్పిటల్స్ ఛైర్మన్ (ప్రకాష్ రాజ్), (మల్లి కామాక్షి భాస్కర్ల), భాస్కర్ పాత్రలు ఏం చేశాయి? అనేది తెలుసుకోవాలంటే డెకాయిట్ చూడాల్సిందే.
విశ్లేషణ:
డెకాయిట్ ఒక రొమాంటిక్ లవ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. హీరోయిన్‌పై పగ సాధించాలనుకునే హీరో కథగా సాగుతుంది. 13 ఏళ్ల జైలు శిక్ష పడిన ఖైదీలా అడివి శేష్‌తో వచ్చే సీన్స్‌తో సినిమా ఆసక్తిరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ స్టోరీలోకి తీసుకెళ్లారు.
జైలు నుంచి హీరో తప్పించుకోవడం, ట్రైన్ యాక్సిడెండ్ సీన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా పాలపిట్టరో.. కన్నుకొట్టరో రీమిక్స్ సాంగ్ ఆడియెన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుంది. హీరోయిన్ జీవితంలోకి హీరో తిరిగి ఎంట్రీ ఇవ్వడం, సరస్వతి పరిస్థితులతో ఇంటర్వెల్ సీన్స్ థ్రిల్ పంచుతాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి దొంగతన చేయాలనుకోవడం, ఇద్దరి లైఫ్‌లో ఉండే ట్రామా అన్ని బాగా చూపించారు.
అలరించే ట్విస్టులు
మరోవైపు హీరో, హీరోయిన్‌ను పట్టుకునేందుకు సీఐ స్వామి ఎంట్రీ ఇవ్వడం, పోలీసుల నుంచి హరి తప్పించుకోవాలనుకోవడం, సరస్వతిని పట్టించాలనే ప్రయత్నాలు సెకండాఫ్‌లో మంచి థ్రిల్ ఇస్తాయి. ఎంతో ప్రేమించిన హరిని హీరోయిన్ జైలు పాలు చేసే కారణాలు పర్వాలేదనిపిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని ట్విస్టులు అలరిస్తాయి.
సినిమాలో వచ్చే ఛేజింగ్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. ఎండింగ్ బాగానే ఉంటుంది. కానీ, ఆడియెన్స్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్, డైరెక్టర్ టేకింగ్ బాగుంది. అయితే, కథలో మరి అంత కొత్తదనం లేకపోవడం ఒకింత మైనస్.
అడివి శేష్ వన్ మ్యాన్ షో చేశాడు. హరిదాస్ పాత్రలో అలరిస్తాడు. మదనపల్లి యాసలో డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో అడివి శేష్ అదరగొట్టాడు. ఇక జూలియట్ సరస్వతిగా మృణాల్ ఠాకూర్ మెప్పిస్తుంది. కళ్లతోనే పలికించే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అనురాగ్ కశ్యప్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అతుల్ కులకర్ణి ఇతర పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రియురాలిపై ప్రియుడు పెంచుకున్న పగ అనే డిఫరెంట్ పాయింట్‌తో సాగే డెకాయిట్ మెప్పిస్తుంది.