Dahaan The Evil Within OTT Release In Telugu: హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. భాషతో సంబంధం లేకుండా భయపెట్టే కథాంశాలు, ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులు ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
థియేటర్లలో సంచలనం

ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒడియా సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా 'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan : The Evil Within) ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
గతంలో ప్రాంతీయ సినిమాలను కేవలం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం చేసేవారు. కానీ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ ఎక్కడున్నా మన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సాధించిన దహాన్ ఓటీటీ ప్రియులకు ఇవాళ (అక్టోబర్ 18) వీకెండ్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు. దహాన్ ది ఈవిల్ వితిన్ చిత్రాన్ని అమియా పట్నాయక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఔరోశిఖా మిశ్రా, బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర, చౌదరి జయప్రకాష్ దాస్, పార్థ సారథి రే కీలక పాత్రలు పోషించారు.
మిస్టరీ భవనం.. సీక్రెట్ బాక్స్ తెరిచాక అసలు కథ!
సింగ్ దేవ్ అనే ఒక పాడుపడిన పాతకాలపు రాజభవనం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. స్థానికులు ఎవరూ ఆ భవనం వైపు వెళ్లేందుకు కూడా సాహసించరు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని ఆ ఊరంతా భావిస్తుంది. అయితే, అదే ఇంట్లోకి నివసించేందుకు అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి తన అక్క, తమ్ముడితో కలిసి వెళ్తారు.
అక్కడ నివసిస్తున్న సమయంలో, ఒక సీక్రెట్ బాక్స్‌ను అనుకోకుండా తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబం జీవితం తలకిందులవుతుంది. ఆ బాక్స్ నుంచి బయటపడిన ఒక దుష్టశక్తి (దెయ్యం) ఆ అమ్మాయిని ఆవహించి, మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
దుష్టశక్తిపై పోరాటం.. సీటు చివర కూర్చోబెట్టే ఉత్కంఠ!
{{/usCountry}}అక్కడ నివసిస్తున్న సమయంలో, ఒక సీక్రెట్ బాక్స్‌ను అనుకోకుండా తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబం జీవితం తలకిందులవుతుంది. ఆ బాక్స్ నుంచి బయటపడిన ఒక దుష్టశక్తి (దెయ్యం) ఆ అమ్మాయిని ఆవహించి, మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
దుష్టశక్తిపై పోరాటం.. సీటు చివర కూర్చోబెట్టే ఉత్కంఠ!
{{/usCountry}}తమ చెల్లెలిని ఆ దుష్టశక్తి బారి నుంచి ఎలాగైనా కాపాడుకోవాలని అక్క, తమ్ముడు తీవ్రంగా శ్రమిస్తారు. అమ్మాయి శరీరంలో ఉన్న ఆ దెయ్యం పిచ్చిపట్టినట్లు చేయడం, మనుషులను పీక్కుతినడం వంటి జిగుప్సాకరమైన పనులన్నీ చేస్తుంది.
ఈ క్రమంలో ఒక ఫాదర్ (పాస్టర్) సాయం తీసుకుంటారు అక్కా, తమ్ముడు. ఆ ఫాదర్ రంగంలోకి దిగాక ఆ భవనంలో ఎలాంటి వింత సంఘటనలు జరిగాయి? ఆ రాజభవనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఫాదర్, తోబుట్టువులు కలిసి ఆ భయంకరమైన దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆ దెయ్యం కథేంటీ? అనే అంశాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రతీ సన్నివేశంలోనూ హారర్ ఎలిమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు నెక్ట్స్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తాయి. ఇంతటీ క్రేజీ హారర్ థ్రిల్లర్ సినిమా దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీలో సందడి చేస్తుంది. అది కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో. ఆహాలో దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ రిలీజ్ అయింది.
అక్టోబర్ 16 నుంచి దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒడియా సినిమా అయినప్పటికీ ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో దహాన్ ప్రీమియర్ అవుతోంది. హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి 'దహాన్' ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.