Danny Movie Release Date Poster Out 2026: టాలీవుడ్లో ఊరమాస్ రస్టిక్ డ్రామాలకు, విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. 'నాటకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త మాస్ అనుభూతిని అందించిన హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్ జీ గోగన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.
లవ్, క్రైమ్, ఎమోషన్స్‌తో డానీ

వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం 'డానీ'. ప్రేమ, క్రైమ్, తీవ్రమైన భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న డానీ చిత్రాన్ని నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా తాజాగా ప్రకటించారు.
ఆకట్టుకుంటున్న 'ఫస్ట్ స్ట్రైక్'.. కాన్సెప్ట్ సైతం డిఫరెంట్!
ఇటీవల డానీ సినిమా నుంచి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. సాధారణ ప్రేమకథల బాటలో కాకుండా, మనుషుల వ్యసనాలు లేదా అలవాట్లు వారి జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయి? ప్రేమలో పడినప్పుడు వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే అంశాలను దర్శకుడు చాలా బోల్డ్‌గా ఆవిష్కరించారు.
'నాటకం' కాంబో మళ్లీ రిపీట్!
ఒక మనిషి జీవితంలో అలవాట్లు, ప్రేమ మధ్య జరిగే ఘర్షణను ఉత్కంఠభరితమైన క్రైమ్ నేపథ్యంతో జోడించి ఈ డానీ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన కాంబినేషన్లో వచ్చిన 'నాటకం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి మాస్ టాక్ సొంతం చేసుకుంది.
డానీ మూవీ బ్యానర్స్
ఇప్పుడు అదే ఇంటెన్సిటీతో అంతకుమించిన కంటెంట్‌తో 'డానీ' మూవీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై రిజ్వాన్ ఈ డానీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొల్లి గోపాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
హీరోయిన్లుగా సేజల్ గుప్తా, సోనాల్ సింగ్
{{/usCountry}}ఇప్పుడు అదే ఇంటెన్సిటీతో అంతకుమించిన కంటెంట్‌తో 'డానీ' మూవీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై రిజ్వాన్ ఈ డానీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొల్లి గోపాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
హీరోయిన్లుగా సేజల్ గుప్తా, సోనాల్ సింగ్
{{/usCountry}}ఇకపోతే డానీ సినిమాలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అజర్ ఖాన్ మరో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా డానీ చిత్రానికి సాయి కార్తీక్ అందించే నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.
ఇంటెన్సిటీ పెంచేలా సాయి కార్తీక్ సంగీతం
డానీ సినిమా సీన్లలోని ఇంటెన్సిటీని పెంచడంలో సాయి కార్తీక్ రీ-రికార్డింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఇక ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, మణికంఠ ఎడిటర్‌గా పనిచేశారు. ఖుషి, సుధాకర్ గోడ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
హీరోపై హీరోయిన్ పడుకుని
ఇదిలా ఉంటే, తాజాగా విడుదల చేసిన డానీ రిలీజ్ డేట్ పోస్టర్లో హీరో, హీరోయిన్ల లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండి సినిమాపై అంచనాలను పెంచుతోంది. హీరోపై హీరోయిన్ వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు వేసుకున్న ఈ పోస్టర్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. పక్కా ఊరమాస్, రస్టిక్ యాక్షన్ లవర్స్‌ను అలరించేలా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.