DC BMW Gifts Row Wamiqa Gabbi Producer: తమిళంలో క్లాసిక్ 'దేవదాస్' కథను సరికొత్త క్రైమ్ డ్రామాగా మలిచి తెరకెక్కించిన 'డీసీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డీసీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చిత్ర బృందానికి ఘనమైన నజరానా అందించింది.
కార్ల కానుక.. ఆనవాయితీగా సన్ పిక్చర్స్
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ 'డీసీ' చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరోగా నటించిన లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ (BMW) లగ్జరీ కార్ల తాళాలను స్వయంగా అందించారు.
జైలర్ సినిమా సమయంలోనూ
గతంలో రజినీకాంత్ 'జైలర్' సినిమా సాధించిన విజయానికి కూడా కళానిధి మారన్ ఇలాగే చిత్ర యూనిట్‌కు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. తాజాగా కార్లను అందజేసిన వీడియోను సన్ పిక్చర్స్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విమర్శల పర్వం
ఈ వేడుక వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, ముఖ్యంగా హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) అభిమానులు సన్ పిక్చర్స్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో 'చంద్ర' అనే బాధిత మహిళ పాత్రలో వామికా కనబరిచిన నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతటి నటనతో మెప్పించిన హీరోయిన్‌కు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు.
హీరోయిన్లకు కనీసం స్కూటీ, సైకిల్ అయిన ఇప్పించండి
"కనీసం ఆమెకు ఒక స్కూటీ అయినా కొనిచ్చి గౌరవించాల్సింది" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్ సన్ పిక్చర్స్ పోస్ట్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. "ఈ సినిమాలో నటించిన సంజన క్రిష్ణమూర్తి (Sanjana Krishnamoorthy)కి కనీసం సైకిల్ అయినా ఇస్తారా? బహుమతుల విషయంలో అందరినీ సమానంగా చూడాలి" అని ఘాటుగా స్పందించారు.
కథకు ప్రాణం పోసిన మహిళా నటులు
{{/usCountry}}"కనీసం ఆమెకు ఒక స్కూటీ అయినా కొనిచ్చి గౌరవించాల్సింది" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్ సన్ పిక్చర్స్ పోస్ట్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. "ఈ సినిమాలో నటించిన సంజన క్రిష్ణమూర్తి (Sanjana Krishnamoorthy)కి కనీసం సైకిల్ అయినా ఇస్తారా? బహుమతుల విషయంలో అందరినీ సమానంగా చూడాలి" అని ఘాటుగా స్పందించారు.
కథకు ప్రాణం పోసిన మహిళా నటులు
{{/usCountry}}దేవదాసు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ 'దాస్' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించగా, వామికా గబ్బి 'చంద్ర'గా, సంజనా క్రిష్ణమూర్తి 'పార్వతి' అనే బార్ సింగర్‌గా కనిపించారు. అవినీతి వ్యవస్థపై, పోలీసుల అక్రమాలపై పోరాడే అంశాలతో అరుణ్ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా మలిచారు.
డీసీ ఓటీటీ స్ట్రీమింగ్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీసీ చిత్రం రూ.103.06 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే, థియేటర్లలో అదరగొట్టిన డీసీ ఓటీటీలోకి కూడా ఇటీవలే వచ్చేసింది. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్ట్స్‌లో డీసీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ వంటి 4 భాషల్లో డీసీ ఓటీటీ రిలీజ్ అయింది.