...
...
Next Story

Deepika Padukone: అవార్డ్ విన్నింగ్ ఓటీటీ సిరీస్ నుంచి దీపికా పదుకొణె అవుట్- స్పిరిట్, కల్కి 2 తర్వాత ఇలా! కారణం ఏంటంటే?

Deepika Padukone Not Part Of The White Lotus Season 4: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రఖ్యాత హాలీవుడ్ ఓటీటీ సిరీస్ ‘ది వైట్ లోటస్’ సీజన్ 4లో నటించడం లేదని తాజాగా తేలిపోయింది. స్పిరిట్, కల్కి 2 తర్వాత అవార్డ్ విన్నింగ్ ఓటీటీ సిరీస్ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఆసక్దిగా మారింది.

Published on: Feb 27, 2026, 13:46:15 IST
Advertisement

ప్రముఖ హాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ ఓటీటీ వెబ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ (The White Lotus) సీజన్ 4లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తోందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని తాజాగా వెరైటీ ఇండియా స్పష్టం చేసింది. దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని సదరు నివేదిక పేర్కొంది.

ఆడిషన్ వల్లే వెనక్కి?

అవార్డ్ విన్నింగ్ ఓటీటీ సిరీస్ నుంచి దీపికా పదుకొణె అవుట్- స్పిరిట్, కల్కి 2 తర్వాత ఇలా! కారణం ఏంటంటే?
అవార్డ్ విన్నింగ్ ఓటీటీ సిరీస్ నుంచి దీపికా పదుకొణె అవుట్- స్పిరిట్, కల్కి 2 తర్వాత ఇలా! కారణం ఏంటంటే?

నిజానికి ఈ ఓటీటీ సిరీస్ మేకర్స్ దీపికా పదుకొణెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీపికా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

"వైట్ లోటస్ సిరీస్‌లో పాత్రల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించడం తప్పనిసరిగా ఉంటుంది. నటీనటులతో సంతకం చేయించే ముందు వారిని పరీక్షించాలని మేకర్స్ పట్టుబట్టారు. కానీ, దీపికా మాత్రం ఆడిషన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఆ కారణంగానే ఈ గొప్ప అవకాశాన్ని ఆమె వదులుకోవాల్సి వచ్చింది" అని హాలీవుడ్ చిత్ర వర్గాలు వెల్లడించాయి.

ఓటీటీ సిరీస్ సీజన్ 3 కోసం కూడా

అంతకుముందు ఈ ఓటీటీ సిరీస్ సీజన్ 3 కోసం కూడా దీపికాను సంప్రదించగా, అప్పుడు ఆమె గర్భవతి కావడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయి ఉంటే, 2017లో వచ్చిన ‘xXx: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ తర్వాత దీపికాకు ఇది రెండో హాలీవుడ్ ప్రాజెక్ట్ అయ్యేది.

ఏమిటీ ‘ది వైట్ లోటస్’?

మైక్ వైట్ సృష్టించిన ఈ బ్లాక్ కామెడీ డ్రామా అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ‘వైట్ లోటస్’ అనే ఒక కల్పిత లగ్జరీ రిసార్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతి సీజన్‌లో కొత్త నటీనటులు, సరికొత్త ప్రదేశాలతో ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇదిలా ఉంటే, దీపికా పదుకొణె చివరిగా ‘సింగం ఎగైన్’లో మెరిసింది. అలాగే, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ కింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ 2026 డిసెంబర్‌లో విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఆ రెండు సినిమాల నుంచి

దీంతోపాటు అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వీటికంటే ముందు ప్రభాస్ సినిమాలు అయిన స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా పదుకొణె వైదొలిగిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ ఓటీటీ సిరీస్ నుంచి కూడా దీపికా ఆడిషన్స్ కారణంగా దూరమవడం ఆసక్తిగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks