OTT Direct: ఓటీటీలోకి నేరుగా రూరల్ కామెడీ లవ్ డ్రామా- వారసత్వంగా భయం వస్తే? పిరికోడి ప్రేమాయణం! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Dhairya Saahase Amrutha OTT Streaming Teaser: ఓటీటీలోకి నేరుగా రూరల్ కామెడీ లవ్ డ్రామా చిత్రం ధైర్యే సాహసే అమృత స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ పిరికోడి ప్రేమాయణంగా ఈ మూవీ ఉంది. మరి ధైర్యే సాహసే అమృత ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడో చూద్దాం.
Dhairya Saahase Amrutha OTT Released Teaser Out: ఓటీటీలోకి తెలుగులో బ్యూటిఫుల్ రూరల్ కామెడీ లవ్ డ్రామాగా సినిమా రానుంది. ఓటీటీలోకి డైరెక్ట్ రిలీజ్ అయ్యే ఆ సినిమానే 'ధైర్యే సాహసే అమృత'. ఈ సినిమాలో దినేష్ కౌశిక, వేణి రావు హీరో హీరోయిన్లుగా నటించారు. థియేటర్ మేనేజర్ మురళిగా దినేష్ కౌశిక చేస్తే.. అమృతగా వేణి రావు నటించింది.

ధైర్యే సాహసే అమృత ట్రైలర్ రిలీజ్
తాజాగా ధైర్యే సాహసే అమృత టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వారసత్వంగా భయమస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ పిరికోడి ప్రేమాయణంగా ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. "అవును నీకు ఇంత భయం కదా. నువ్వు ధైర్యంగా చేసిన ఒక్క పని చెప్పు" అని హీరోను హీరోయిన్ అడుగుతుంది.
"ధైర్యం సినిమా నాలుగు సార్లు చూశాను తెలుసా ధైర్యంగా" అని హీరో గర్వంగా చెప్పుకోవడంతో నవ్విస్తూ టీజర్ ప్రారంభం అవుతుంది. "ఎవడికైనా ఆస్తులు వారసత్వంగా వస్తాయి. వీడికేమో నీ తమ్ముడు భయం వారసత్వంగా వచ్చింది" అని హీరో తండ్రి తిట్టడంతో సినిమాలో దినేష్ పాత్ర ఎలా ఉంటుందో చూపించారు.
నవ్వించే సీన్లు
ఆ తర్వాత పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడమని హీరోకు హీరోయిన్ చెప్పడం దానికి సాకులు చెబుతూ కథానాయకుడు తప్పించుకోవడం సీన్లు నవ్వించేలా ఉన్నాయి. చివరికి ఇంట్లో హీరో గురించి తానే చెప్పి ఒప్పించానని హీరోయిన్ చెబుతుంది. దానికి హీరో సంతోషిస్తాడు. "మీ ఇంట్లో అయితే నువ్వే చెప్పాలి" అని హీరోయిన్ వేణి రావు అంటుంది.
దాంతో "మళ్లీ మొదటికి వచ్చింది అని భయపడిపోతాడు" హీరో పాత్ర అయిన మురళి. అనంతరం ఈ ప్రేమజంట కథ మలుపు తిరుగుతుంది. మురళి పిరికితనం అమృతకు పెద్ద సమస్యగా మారుతుంది. పిరికోడితో బతకలేనని అమృత చెప్పడంతో సినిమా సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది.
ధైర్య సాహసాలతో అమృతను ఎలా దక్కించుకున్నాడు?
ఆ తర్వాత ఏమైంది? భయాన్ని వదిలి ప్రేయసి అమృతను మురళి దక్కించుకున్నాడా? అందుకోసం ఏం చేశాడు? ఎలా పిరికితనం పోగొట్టుకున్నాడు? చివరికి ధైర్య సాహసాలతో అమృతను ఎలా దక్కించుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.
ఇక టీజర్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు, కెమిస్ట్రీ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఈ కథను సూర్య తేజ్ రాయడమే కాకుండా, దినేష్ కౌశిక, విజయ్ కుమార్ పలూరిలతో కలిసి ఆయనే క్రియేట్ చేశారు. రొడ్డ భరద్వాజ్, నరేన్ పయ్యావుల నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ వెంగలదాసు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఆహా ఓటీటీలోకి
సాంకేతిక విభాగంలో నిఖిల్ కుమార్ నాంపెల్లి అందించిన విజువల్స్, ఎడిటర్ ఎం. రాకేశ్ రెడ్డి వర్క్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి, సంగీత దర్శకుడు ఆదిత్య బి.ఎన్ ఆలపించిన పాటలు ఈ లవ్ స్టోరీని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. భరద్వాజ్ గాలి, ఫణి కృష్ణ సంకేపల్లి అందించిన లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.
ఇలా స్వచ్ఛమైన రూరల్ కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కిన ధైర్యే సాహసే అమృత ఓటీటీలోకి నేరుగా వచ్చేయనుంది. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో ధైర్యే సాహసే అమృత ఓటీటీ రిలీజ్ అవనుంది. జూన్ 18 నుంచి ధైర్యే సాహసే అమృత ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఆహా సంస్థ ప్రకటించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


