Dhamaal 4 OTT Release: బాలీవుడ్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ధమాల్’ సిరీస్ నుంచి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ ఫ్రాంచైజీ ‘ధమాల్ 4’ జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
క్రేజీ హంట్ బ్యాక్‌డ్రాప్

ప్రముఖ దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం.. పాత పాత్రలతో పాటు సరికొత్త కన్ఫ్యూజన్ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీల కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం.
గతంలో వచ్చిన ఈ సిరీస్ మూడు భాగాలు ఆడియన్స్‌ను విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు నాలుగో భాగం కూడా అదే తరహా క్రేజీ ట్రెజర్ హంట్ (నిధి అన్వేషణ) బ్యాక్‌డ్రాప్‌తో థియేటర్లలోకి వచ్చి నవ్వులు పూయిస్తోంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఎమ్‌డీబీ నుంచి ధమాల్ 4 సినిమాకు 7 రేటింగ్ వచ్చింది.
కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 102.83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది ధమాల్ 4 సినిమా. హారర్, కామెడీ, అడ్వెంచర్, యాక్షన్, ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ధమాల్ 4 సినిమాను తెరకెక్కించారు.
అసలు కథేంటంటే?
ఈసారి కథ కూడా ఒక రహస్య నిధి చుట్టూనే తిరుగుతుంది. యాంటిక్ షాప్ నడిపే గుడ్డు, జానీలకు పృథ్వీ అనే వ్యక్తి దగ్గర ఒక అద్భుతమైన నిధికి సంబంధించిన రహస్యం ఉందని తెలుస్తుంది. కానీ, వారు ఆ నిధిని కనిపెట్టేలోపే 'అధూరా' అనే ఒక విచిత్రమైన సముద్రపు దొంగ పృథ్వీని కిడ్నాప్ చేసి, నిధి మ్యాప్‌ను ముక్కలు ముక్కలు చేస్తాడు.
{{/usCountry}}ఈసారి కథ కూడా ఒక రహస్య నిధి చుట్టూనే తిరుగుతుంది. యాంటిక్ షాప్ నడిపే గుడ్డు, జానీలకు పృథ్వీ అనే వ్యక్తి దగ్గర ఒక అద్భుతమైన నిధికి సంబంధించిన రహస్యం ఉందని తెలుస్తుంది. కానీ, వారు ఆ నిధిని కనిపెట్టేలోపే 'అధూరా' అనే ఒక విచిత్రమైన సముద్రపు దొంగ పృథ్వీని కిడ్నాప్ చేసి, నిధి మ్యాప్‌ను ముక్కలు ముక్కలు చేస్తాడు.
{{/usCountry}}ನಿధి ఎక్కడుందో తెలిసిన ఏకైక వ్యక్తి పృథ్వీ కావడంతో అతడిని పట్టుకోవడానికి అందరూ రేసు గుర్రాల్లా పరిగెడతారు. ఈ రేసులోకి ఆది, మానవ్, లల్లన్ కూడా ప్రవేశించడంతో కథ పూర్తిగా మలుపులు తిరుగుతుంది. అడవుల్లో సాగే ప్రయాణం, ఛేజింగ్ సీన్లు, 'M' అనే అక్షరం కింద దాగున్న ఆ రహస్య నిధిని దక్కించుకోవడానికి ఒకరినొకరు మోసంచేసుకుంటూ చేసే విచిత్రమైన తప్పులు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇలాంటి ధమాల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. ధమాల్ 4 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో ధమాల్ 4 ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో విడుదలైన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి.
ఆ లెక్కన చూసుకుంటే ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెలలో ధమాల్ 4 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4 అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ధమాల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.