తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర. తాజాగా చెన్నైలో కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలోని బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. ఆ సమయంలో పాత రోజులను గుర్తు చేసుకున్న ధనుష్, తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను పంచుకున్నారు.
బైక్ కోసం తపించే పాత్రలో

వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'పొల్లాదవన్'లో ధనుష్ ఒక మధ్యతరగతి యువకుడిగా, బైక్ కోసం తపించే పాత్రలో అద్భుతంగా నటించారు. "పొల్లాదవన్ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా కంటే ముందు నన్ను చూసిన వారంతా 'చాలా బక్కగా ఉన్నావు' అంటూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ సినిమాలో మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో (Six-pack) కనిపించినప్పుడు, జనం నా బాడీని చూసి చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు. నా కెరీర్‌లో అది మర్చిపోలేని అనుభూతి" అని ధనుష్ గుర్తు చేసుకున్నారు.
'యద్భావం తద్భవతి'.. నమ్మకమే గెలిపించింది
తన యువ అభిమానులకు సందేశమిస్తూ, ధనుష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లు 'యద్భావం తద్భవతి'.. మనం ఏది బలంగా కోరుకుంటామో అదే అవుతాం" అని ధనుష్ చెప్పారు.
"2002-2003 ఆ సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరికైనా చెప్పి ఉంటే అందరూ నవ్వుకునేవారు. కానీ, నా మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు నేషనల్ అవార్డ్ అందుకుంటానని బలంగా అనుకున్నాను. అనుకున్నట్లే ఆ సమయం వచ్చింది" అని ధనుష్ పేర్కొన్నారు.
నిజంగానే ఆయన పట్టుదల ఫలించింది. 2010లో 'ఆడుగళం' సినిమాకు, ఆ తర్వాత 2019లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు ధనుష్. నటుడిగానే కాకుండా నిర్మాతగా 'కాకా ముట్టై', 'విసరనై' చిత్రాలకు కూడా ఆయన జాతీయ పురస్కారాలను కైవసం చేసుకోవడం విశేషం.
పట్టపగలే బ్యాంక్ దోపిడీ.. ఏంటి ఈ 'కర' కథ?
{{/usCountry}}నిజంగానే ఆయన పట్టుదల ఫలించింది. 2010లో 'ఆడుగళం' సినిమాకు, ఆ తర్వాత 2019లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు ధనుష్. నటుడిగానే కాకుండా నిర్మాతగా 'కాకా ముట్టై', 'విసరనై' చిత్రాలకు కూడా ఆయన జాతీయ పురస్కారాలను కైవసం చేసుకోవడం విశేషం.
పట్టపగలే బ్యాంక్ దోపిడీ.. ఏంటి ఈ 'కర' కథ?
{{/usCountry}}ప్రస్తుతం ధనుష్ నటించిన 'కర' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్. పట్టపగలే బ్యాంకులను దోచుకునే ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలు పోషించారు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, తేని ఈశ్వర్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. కర ట్రైలర్‌లో ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.