నెలల తరబడి సాగిన నిరీక్షణ, సోషల్ మీడియాలో భారీ హైప్.. వీటన్నింటి మధ్య ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే వందలాది ప్రివ్యూ షోలు పడటంతో, అర్ధరాత్రి కల్లా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు వెల్లువెత్తాయి.
ట్విట్టర్ టాక్: 'ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్?'

భారీ అంచనాలను అందుకోవడం ఏ సినిమాకైనా కత్తిమీద సామే.. కానీ, ‘ధురంధర్ 2’ ఆ అంచనాలను వందశాతం అందుకుందని పలు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే, ప్రివ్యూ షోలు చూసిన ప్రేక్షకులు, విమర్శకులు ధురంధర్ 2 సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇంటర్వెల్‌కే మైండ్ బ్లాక్
కొందరైతే ఏకంగా ఇది ‘భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ చిత్రం’ అని అభివర్ణిస్తున్నారు. "ఇంటర్వెల్‌కే మైండ్ బ్లాక్ అయిపోయింది. మేకింగ్, మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. కథ చాలా సహజంగా, ఇంటెన్స్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద అంచనాలు పెంచేసింది. నిడివి ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది" అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.
10కి 9.8 రేటింగ్
ఈ సినిమాకు 10కి 9.8 రేటింగ్ ఇస్తూ.. "సినిమా కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ, యాక్షన్, పాలిటిక్స్ అదిరిపోయాయి. ఆదిత్య ధర్ దర్శకత్వం అద్భుతం" అని మరికొందరు కొనియాడారు.
నాలుగు గంటల నిడివి.. సహనానికి పరీక్షా?
{{/usCountry}}ఈ సినిమాకు 10కి 9.8 రేటింగ్ ఇస్తూ.. "సినిమా కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ, యాక్షన్, పాలిటిక్స్ అదిరిపోయాయి. ఆదిత్య ధర్ దర్శకత్వం అద్భుతం" అని మరికొందరు కొనియాడారు.
నాలుగు గంటల నిడివి.. సహనానికి పరీక్షా?
{{/usCountry}}ఈ సీక్వెల్ రన్‌టైమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "సినిమా చాలా సాగదీసినట్లు ఉంది, కొన్ని చోట్ల స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువయ్యాయి" అని కొందరు పెదవి విరుస్తుంటే.. "4 గంటలైనా ఎక్కడా బోర్ కొట్టలేదు, స్క్రీన్‌ప్లే అంతలా కట్టిపడేసింది" అని మరికొందరు సమర్థిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో..
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటన పీక్స్‌లో ఉందన్నది మెజారిటీ ప్రేక్షకుల మాట. సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్‌లపై ప్రశంసలు కురిపించారు.
ముగ్ధురాలైన ప్రీతి జింటా!
"@AdityaDharFilms.. మీ మేకింగ్‌కు నేను ఫ్యాన్ అయిపోయాను. ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు థాంక్యూ. రణ్‌వీర్.. నీ నటన చూసి నా మనసు నిండిపోయింది. ఆ లోతు, ఆ సిన్సియారిటీ మరే నటుడిలోనూ ఉండవు" అని ప్రీతి జింటా పేర్కొన్నారు. రణ్‌వీర్ సింగ్‌కు కచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందేనని అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
రాజకీయాలు.. ప్రొపగండా విమర్శలు
అయితే, ధురంధర్ 2 సినిమాలోని రాజకీయ నేపథ్యం ఒక వర్గం ప్రేక్షకులకు రుచించడం లేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన 'ప్రొపగండా' చిత్రమని కొందరు విమర్శిస్తున్నారు.
బలవంతంగా చొప్పించిన అజెండా
"ఇది సినిమాలా లేదు, ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉంది. పాత్రల కంటే నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. లోతు లేని కథ, బలవంతంగా చొప్పించిన అజెండా వల్ల సినిమా విసిగిస్తోంది" అని ఒక నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ధురంధర్ 2 విశేషాలు
కాగా 2025లో బ్లాక్ బస్టర్ అయిన 'ధురంధర్'కు ఇది ముగింపు భాగం. రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ 'రివెంజ్' యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.