బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సినిమా సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగో వారంలో కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ సినిమాకైనా నాలుగో వారం వచ్చేసరికి వసూళ్లు తగ్గుముఖం పడతాయియ. కానీ, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రం సోమవారం కంటే మంగళవారం ఎక్కువ వసూళ్లను రాబట్టి తన సత్తా చాటుతోంది.
రూ. 700 కోట్ల మైలురాయి దాటిన తొలి బాలీవుడ్ చిత్రం
ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, 26వ రోజైన మంగళవారం (డిసెంబర్ 30) దురంధర్ సినిమా దేశవ్యాప్తంగా సుమారు రూ. 11.25 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 712 కోట్లకు చేరుకున్నాయి.
గత శని, ఆదివారాల్లో వరుసగా రూ. 20 కోట్లు, రూ. 22.5 కోట్లు సాధించిన దురంధర్ సోమవారం రూ. 10.5 కోట్లు రాబట్టింది. భారతీయ సినీ చరిత్రలో దేశీయ మార్కెట్‌లో రూ. 700 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రంగా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది.
‘కల్కి’, ‘పఠాన్’ రికార్డులు అవుట్
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్’ పంజా విసురుతోంది. 25వ రోజు నాటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1081 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం దురంధర్ సినిమా కన్ను షారుక్ ఖాన్ ‘జవాన్’ (రూ. 1160 కోట్లు) రికార్డుపై ఉంది. ఇదే వేగం కొనసాగితే ఈ శుక్ర లేదా శనివారానికల్లా జవాన్‌ను వెనక్కి నెట్టి 6వ స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’ (రూ. 1215 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ. 1230 కోట్లు) రికార్డులను కూడా దురంధర్ చిత్రం సవాల్ చేసే అవకాశం ఉంది.
26 రోజుల కలెక్షన్స్
దురంధర్ సినిమా 26 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 1101 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 246.30 కోట్లు, ఇండియాలో రూ. 854.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది సారా అర్జున్ హీరోయిన్గా చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.
కరణ్ జోహార్ ప్రశంసల జల్లు
{{/usCountry}}దురంధర్ సినిమా 26 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 1101 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 246.30 కోట్లు, ఇండియాలో రూ. 854.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది సారా అర్జున్ హీరోయిన్గా చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.
కరణ్ జోహార్ ప్రశంసల జల్లు
{{/usCountry}}"ధురంధర్ నన్ను మంత్రముగ్ధుడిని చేసింది. ఈ సినిమా చూశాక నా క్రాఫ్ట్ చాలా పరిమితమైనది అనిపించింది. దర్శకుడు తన ప్రతిభను ఎక్కడా ప్రదర్శించుకోవాలని చూడకుండా, ఎంతో సహజంగా కథను నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాడకం నెక్ట్స్ లెవల్‌లో ఉంది" అని కరణ్ జోహార్ కొనియాడారు.
కాగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో దురంధర్ సినిమా తెరకెక్కింది. గూఢచారి వ్యవస్థ, అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ధురంధర్ 2
ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని ప్రకటించింది. ‘ధురంధర్ 2’ వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి రానుంది.