...
...
Next Story

Dhurandhar OTT: ఓటీటీలోకి రేపే ధురంధర్ రా ఎడిషన్- సెన్సార్ కట్ అయిన సీన్లు, డైలాగ్స్‌తో- తెలుగులో స్ట్రీమింగ్- అయోమయంగా!

Dhurandhar Part 1 Raw And Undekha OTT Streaming: కలెక్షన్ల సునామీ సృష్టించిన ధురంధర్ సినిమా సరికొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధురంధర్ మొదటి భాగం 'రా అండ్ అన్‌దేఖా' వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇండియాలో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ వివరాలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

Published on: May 21, 2026, 09:12:45 IST
Advertisement

Dhurandhar Part 1 Raw And Undekha OTT Release Telugu: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ , ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలిచింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా దుమ్మురేపుతోంది.

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌

ఓటీటీలోకి రేపే ధురంధర్ రా ఎడిషన్- సెన్సార్ కట్ అయిన సీన్లు, డైలాగ్స్‌తో- తెలుగులో స్ట్రీమింగ్- అయోమయంగా!
ఓటీటీలోకి రేపే ధురంధర్ రా ఎడిషన్- సెన్సార్ కట్ అయిన సీన్లు, డైలాగ్స్‌తో- తెలుగులో స్ట్రీమింగ్- అయోమయంగా!

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఒక అప్‌డేట్ అటు అభిమానుల్లో జోష్ నింపుతూనే, ఇటు తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే, ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ధురంధర్ 2 అన్‌కట్ వెర్షన్ ఓవర్సీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఆడియెన్స్‌కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ధురంధర్ పార్ట్ 1 అన్‌కట్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే, 'ధురంధర్' మొదటి భాగానికి సంబంధించి థియేటర్లలో విడుదల కాని కొన్ని కీలకమైన సీన్లను ఈ వెర్షన్‌తో స్ట్రీమింగ్ చేయనున్నారు.

రా అండ్ అన్‌దేఖా టైటిల్‌తో

'రా అండ్ అన్‌దేఖా' (Raw & Undekha) అనే టైటిల్‌తో ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను మే 22 అంటే రేపటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ అన్‌కట్ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

ఈ క్రేజీ అప్‌డేట్ పక్కన పెడితే, సగటు ఓటీటీ ప్రేక్షకుడికి మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. దానికి కారణం ఈ సినిమా ఓటీటీ రైట్స్ పంపిణీనే. 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) చిత్రం అంతర్జాతీయంగా మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కానీ, భారతీయ ప్రేక్షకుల కోసం ఈ రెండో భాగం జూన్ 4న జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ప్రసారం కానుంది.

ఒకే సినిమాకు సంబంధించిన రెండు భాగాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో, వేర్వేరు తేదీల్లో వస్తుండటంతో ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. "మొదటి భాగం రా వెర్షన్‌ను ఇప్పుడెందుకు ఇస్తున్నారు, ముందే ఇవ్వొచ్చు కదా?" అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే "హాట్‌స్టార్ పరిస్థితి ఘోరంగా తయారైంది" అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం

'ఉరి' సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ ధురంధర్ ఫ్రాంచైజీని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. 2025 డిసెంబర్ 5న విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1307 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇక ఈ ఏడాది మార్చి 19న విడుదలైన సీక్వెల్ 'ధురంధర్ 2' ఆ రికార్డులను తిరగరాస్తూ రూ. 1790 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

అసలు కథేంటంటే?

ఈ సినిమా కథాంశం ఒక హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో ఉన్న ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి భారత ఏజెంట్ జస్కీరాత్ సింగ్ రంగీ (అలియాస్ హంజా అలీ మజారీ) రంగంలోకి దిగుతాడు. అక్కడ బలూచ్ గ్యాంగ్‌లోకి చొరబడి, స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకుని ఆ సమాజంలో కలిసిపోతాడు. ఆ తర్వాత అతను ఆ ఉగ్రవాద ముఠాను ఎలా మట్టుబెట్టాడనేదే ప్రధాన ఇతివృత్తం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks