...
...
Next Story

మంచి హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ అతనికి ఉన్నాయి, కావాల్సింది అదొక్కటి మాత్రమే: డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే, సంగీత్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Feb 16, 2026 12:33 PM IST
Advertisement

వరుస సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అప్పుడప్పుడు పలు సినీ ఈవెంట్స్‌కు హజరవుతూ తన స్పీచ్‌తో అట్రాక్ట్ చేస్తుంటారు అనిల్ రావిపూడి.

రొమాంటిక్ డ్రామా మూవీ

మంచి హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ అతనికి ఉన్నాయి, కావాల్సింది అదొక్కటి మాత్రమే: డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్
మంచి హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ అతనికి ఉన్నాయి, కావాల్సింది అదొక్కటి మాత్రమే: డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

అనిల్ రావిపూడి కామెంట్స్

అయితే, మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు నిర్వహించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు అనిల్ రావిపూడి. కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చూడగానే ఎక్స్‌ట్రార్డినరీ అనిపించింది

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "యూవీ ప్రొడ్యూసర్స్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. ష్యూర్ షాట్ హిట్ అనే ఫీల్ కలిగింది. అంత బ్యాలెన్స్‌డ్‌గా మూవీ ఉంది. ఎమోషనల్ రైడ్‌లా ఉంది" అని అన్నారు.

కావాల్సింది అదొక్కటే

"సంతోష్ శోభన్, మానస పర్‌ఫెక్ట్ పెయిర్‌లా అనిపించారు. సంతోష్‌కు మంచి హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కావాల్సింది ఒక సూపర్ డూపర్ హిట్ మాత్రమే. అది ఈనెల 14న ఈ సినిమాతో వచ్చేస్తుంది" అని అనిల్ రావిపూడి చెప్పారు.

పర్‌ఫెక్ట్ జోనర్ మూవీ

ఇదే ఈవెంట్‌లో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "మనకు ఈ మధ్య లవ్ స్టోరీస్ తగ్గిపోయాయి. ఈ టైమ్‌లో వస్తున్న అరుదైన ప్రేమ కథ ఇది. ప్రేమంటే ప్రేమలో పడిపోవడం కాదు. ప్రేమించిన వారిని నిలబెట్టడం. రియాల్టీకి దగ్గరగా ఉండే చిత్రమిది" అని అన్నారు.

పది చోట్ల ప్రీమియర్స్

"ఈ సినిమా నేను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. పది చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నాం. టికెట్స్ అన్నీ ఫాస్ట్‌గా ఫిల్ అవుతున్నాయి. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం" అని తెలిపారు నిర్మాత ధీరజ్ మొగిలినేని.

నిరాశ పరచదు

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. "మేమంతా హానెస్ట్‌గా చేసిన చిత్రమిది. మిమ్మల్ని నిరాశ పరచదు. మంచి సినిమా చేశామని నమ్ముతున్నాం. మా మూవీకి కేవలం టైటిల్ వల్లే ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమాలో అలాంటి కంటెంట్ ఉండదు. ఏ అంటే మా దృష్టిలో ఆల్ అని అనుకుంటున్నాం. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. థియేటర్స్‌లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe