మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అఖండ 2 సినిమాలో డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ నటించారు.
చిన్న కొడుకు పరిచయం

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అలాగే, తన కుమారుడు వర్షిత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
ఆ యాక్షన్ నమ్ముతాను
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను ఎమోషన్‌ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఆ యాక్షన్‌కి నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలాగే ఫ్యూచర్‌లో బెస్ట్ మాస్టర్ అయ్యే రాహుల్, అలాగే ఒక ఫైట్‌కి రవి వర్మ గారు పనిచేశారు. కొరియోగ్రాఫర్స్‌కి థాంక్యూ" అని అన్నారు.
విజన్‌కు ప్రాణం పోసిన
"నా విజన్ స్క్రీన్ మీద చూపించే కెమెరామెన్, ఆ విజన్‌కి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తనతో నాకు సరైనోడు నుంచి జర్నీ ఉంది. ఈ సినిమాకి సంతోష్, రామ్ ప్రసాద్ ఇద్దరు కెమెరామెన్‌గా పనిచేశారు. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు" అని బోయపాటి శ్రీను తెలిపారు.
ఎంతో స్వేచ్ఛనిచ్చారు
"పూర్ణ అద్భుతమైన ఆర్టిస్ట్. హర్షాలి భజరంగ్ భాయిజాన్ తర్వాత మన సినిమానే చేసింది. తన క్యారెక్టర్‌ని చాలా అభిమానిస్తారు. మా నిర్మాతలు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. వారి స్వేచ్ఛ వల్లే నేను ఇంత బ్రహ్మాండంగా సినిమాను తీయగలిగాను" అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి
"అఖండ 2లో మా చిన్నబ్బాయి (వర్షిత్) ఒక క్యారెక్టర్ చేశాడు తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. సినిమా తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు." అని దర్శకుడు బోయపాటి వెల్లడించారు.
భగవంతుడే దారి చూపించాడు
{{/usCountry}}"అఖండ 2లో మా చిన్నబ్బాయి (వర్షిత్) ఒక క్యారెక్టర్ చేశాడు తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. సినిమా తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు." అని దర్శకుడు బోయపాటి వెల్లడించారు.
భగవంతుడే దారి చూపించాడు
{{/usCountry}}"ఇందులో మేము షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ చూస్తే మీకు నమ్మశక్యంగా ఉండవు. ఆ భగవంతుడే మాకు దారి చూపించాడు. జన్మభూమికి యుద్ధం జన్మభూమి కోసం యుద్ధం చేసే సైనికులు అన్నిచోట్ల ఉంటారు. కానీ, కర్మభూమి కోసం యుద్ధం చేసే వీరులు భారతదేశంలోనే ఉంటారు. వాళ్లు ఉండబట్టే ఈ దేశం ముందుకు వెళుతుంది" అని బోయపాటి శ్రీను అభిప్రాయపడ్డారు.
అఖండ అన్‌స్టాపబుల్
ఇదే ఈవెంట్‌లో నటి, సీనియర్ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. అఖండలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా అంతే అద్భుతమైన అనుభూతినిచ్చే పాత్ర ఇచ్చారు. బాలకృష్ణ గారు అన్‌స్టాపబుల్.. అఖండ కూడా అన్‌స్టాపబుల్. జై బాలయ్య" అని అన్నారు.