Deva Katta Clarity On Rumours Of Varanasi Dragon: తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన రాజకీయ, సామాజిక కథాంశాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు దేవ కట్టా. 'వెన్నెల', 'ప్రస్థానం', 'రిపబ్లిక్' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
వారణాసి, డ్రాగన్ సినిమాలకు

అయితే, తాజాగా తన ప్రొఫెషనల్ లైఫ్‌పై వస్తున్న కొన్ని రూమర్లపై దేవ కట్టా తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో దేవ కట్టా వేరే దర్శకుల సినిమాలకు గుట్టుచప్పుడు కాకుండా కొన్ని సీన్లు డైరెక్ట్ చేస్తున్నారని టాక్ నడిచింది.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమాకు దేవ కట్టా రైటర్‌గా పని చేస్తున్నారని, అంతేకాకుండా ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ చిత్రం డ్రాగన్‌కు కొన్ని కీలకమైన సీన్స్ డైరెక్ట్ చేస్తున్నారని రకరకాల ప్రచారాలు సాగాయి. ఈ పుకార్లకు పూర్తిగా చెక్ పెడుతూ దేవ కట్టా ఒక అధికారిక ప్రకటన చేశారు.
క్లిక్స్ కోసం తప్పుడు ప్రచారం
తాను ప్రస్తుతం తన సొంత ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి పెట్టానని దేవ కట్టా వెల్లడించారు. కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం మాత్రమే కొందరు ఇటువంటి తప్పుడు వార్తలను ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ తరహా ప్రచారాలు చాలా అనాగరికంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తంచేశారు.
"నేను ప్రస్తుతం నా తదుపరి సినిమా కథా చర్చలు, స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. అంతే తప్ప, వేరే ఏ చిత్రానికి సంబంధించి ఒక్క షాట్ కూడా నేను డైరెక్ట్ చేయడం లేదు" అని దేవా కట్టా స్పష్టమైన ప్రకటన చేశారు. దీనితో ఆయన ఇతరుల సినిమాల్లో వేలు పెడుతున్నారంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా తెరపడింది.
కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం
{{/usCountry}}"నేను ప్రస్తుతం నా తదుపరి సినిమా కథా చర్చలు, స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. అంతే తప్ప, వేరే ఏ చిత్రానికి సంబంధించి ఒక్క షాట్ కూడా నేను డైరెక్ట్ చేయడం లేదు" అని దేవా కట్టా స్పష్టమైన ప్రకటన చేశారు. దీనితో ఆయన ఇతరుల సినిమాల్లో వేలు పెడుతున్నారంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా తెరపడింది.
కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం
{{/usCountry}}తన రాబోయే ప్రాజెక్టు గురించి చెబుతూ దేవ కట్టా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. తన కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ల్యాండ్‌మార్క్ చిత్రం కాబోతుందని హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను, అప్‌డేట్స్‌ను సరైన సమయం వచ్చినప్పుడు స్వయంగా వెల్లడిస్తానని చెప్పారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను చాలా రహస్యంగా ఉంచినప్పటికీ, దేవ కట్టా మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ లేదా ఒక పవర్‌ఫుల్ డ్రామాగా ఇది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దేవ కట్టా కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా రచయితగానూ టాలీవుడ్‌లో బిజీగా మారారు.
రూమర్లకు ముగింపు
ఇటీవల విడుదలైన ఓటీటీ పొలిటికల్ డ్రామా సిరీస్ 'మయసభ'కు ఆయన అందించిన పవర్‌ఫుల్ డైలాగ్స్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, ఇండస్ట్రీలో ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌పై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాకపోయినా, దేవ కట్టా స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది.