Imtiaz Ali On Daughter Ida Ali Engagement: 'జబ్ వి మెట్', 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' వంటి రొమాంటిక్ క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఆయన సినిమాల్లోని లవ్ సీన్స్ ఎంత అందంగా ఉంటాయో, ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ అలాంటి ఒక అద్భుతమైన ప్రేమకథ శుభం కార్డు వైపు అడుగులు వేస్తోంది.
నార్వే లోయల్లో ఫిల్మీ ప్రపోజల్

ఇంతియాజ్ అలీ కుమార్తె, యంగ్ ఫిల్మ్ మేకర్ ఇదా అలీ (25) తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ క్రిష్ అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 1వ తేదీన నార్వేలోని అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య క్రిష్ అగర్వాల్.. ఇదా అలీకి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని చూపిస్తూ క్రిష్ ప్రపోజ్ చేసిన విధానం పక్కా ఇంతియాజ్ అలీ సినిమా సీన్‌ను తలపించింది.
ఈ డ్రీమ్ ప్రపోజల్‌కు ఇదా అలీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా ఆదివారం (జూలై 12) నాడు ఇదా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
మామగారి పర్మిషన్ తోనే..
నేటి తరం ప్రేమకథ అయినప్పటికీ, క్రిష్ అగర్వాల్ పాతకాలపు పద్ధతులను, సంప్రదాయాలను గౌరవించారు. ఇదాకు ప్రపోజ్ చేయడానికి ముందే ఆయన కాబోయే మామగారు ఇంతియాజ్ అలీని కలిసి మాట్లాడారు.
"ఇది నాకు అత్యంత సంతోషకరమైన సమయం. ఇదాకు ప్రపోజ్ చేయడానికి ముందే క్రిష్ నాతో మాట్లాడి నా ఆశీస్సులు తీసుకున్నాడు" అని ఇంతియాజ్ అలీ తన ఆనందాన్ని పంచుకున్నారు. కూతురి జీవితంలో వచ్చిన ఈ మైలురాయిని చూసి ఆయన ఎంతో మురిసిపోతున్నారు.
కాబోయే అల్లుడు క్రిష్ ఎవరు?
ఇంతియాజ్ అలీ కాబోయే అల్లుడు క్రిష్ అగర్వాల్ (24) సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఫైనాన్షియల్ హెడ్జ్ ఫండ్‌లో క్వాంటిటేటివ్ రీసెర్చర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇదా, క్రిష్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ప్రపంచాన్ని చుట్టేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే వీరిని నార్వే వరకు తీసుకెళ్లి, అక్కడ ఒక అందమైన బంధానికి పునాది వేసేలా చేసింది.
పెళ్లి ఎప్పుడంటే?
{{/usCountry}}ఇంతియాజ్ అలీ కాబోయే అల్లుడు క్రిష్ అగర్వాల్ (24) సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఫైనాన్షియల్ హెడ్జ్ ఫండ్‌లో క్వాంటిటేటివ్ రీసెర్చర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇదా, క్రిష్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ప్రపంచాన్ని చుట్టేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే వీరిని నార్వే వరకు తీసుకెళ్లి, అక్కడ ఒక అందమైన బంధానికి పునాది వేసేలా చేసింది.
పెళ్లి ఎప్పుడంటే?
{{/usCountry}}నిశ్చితార్థం ముగియడంతో బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడే పెళ్లి గురించిన చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇంతియాజ్ అలీ మాత్రం పెళ్లి విషయంలో ఎలాంటి తొందరపడటం లేదు. "నేను వాళ్ల విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోదల్చుకోలేదు. ప్రస్తుతానికి ఈ మధుర క్షణాలను వాళ్లను ఎంజాయ్ చేయనివ్వండి" అని ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు.
తండ్రి మాటలకు తగ్గట్టే ఇదా అలీ కూడా స్పందిస్తూ.. "ప్రస్తుతానికి పెళ్లి ప్లాన్స్ ఏమీ లేవు. మా నాన్నగారు చెప్పినట్లు ఈ మధురమైన క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
బాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు
ఈ క్రేజీ కపుల్‌కు బాలీవుడ్ ప్రముఖులు అయిన శార్వరి వాఘ్, ఖుషి కపూర్, ఓరి, అలియా కశ్యప్, వేదాంగ్ రైనాతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.