...
...
Next Story

ధర్మస్థల నియోజకవర్గం నుంచి పవర్‌ఫుల్ సాంగ్- రిలీజ్ చేసిన క్రిష్, చంద్రబోస్- ధర్మం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రతీ పదం!

Dharmasthala Niyojakavargam Song Release By Krish Chandrabose: తెలుగులో పొలిటికల్ డ్రామాగా వస్తున్న ధర్మస్థల నియోజకవర్గం సినిమా నుంచి ధర్మో రక్షతి రక్షితః సాంగ్ రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటను హైదరాబాద్‌లో ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published on: Aug 16, 2026, 18:30:35 IST
Advertisement

Dharmasthala Niyojakavargam Song Release By Krish Chandrabose: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'. మూవింగ్ డ్రీమ్స్ బ్యానర్‌పై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా ఈ ధర్మస్థల నియోజకవర్గం చిత్రం నుంచి 'ధర్మో రక్షతి రక్షితః' అంటూ సాగే పవర్ ఫుల్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు.

ధర్మో రక్షతి రక్షితః సాంగ్ లాంచ్

ధర్మస్థల నియోజకవర్గం నుంచి పవర్‌ఫుల్ సాంగ్- రిలీజ్ చేసిన క్రిష్, చంద్రబోస్- ధర్మం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రతీ పదం!
ధర్మస్థల నియోజకవర్గం నుంచి పవర్‌ఫుల్ సాంగ్- రిలీజ్ చేసిన క్రిష్, చంద్రబోస్- ధర్మం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రతీ పదం!

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 'ధర్మో రక్షతి రక్షితః' సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, గేయ రచయిత చంద్రబోస్ సంయుక్తంగా ఈ ధర్మో రక్షతి రక్షితః పాటను విడుదల చేయడం విశేషంగా మారింది.

సినిమా ఆత్మను ఆవిష్కరించేలా..

ధర్మస్థల నియోజకవర్గం చిత్ర కథాంశానికి, కథలోని సందేశానికి అద్దం పట్టేలా ఈ పాటను తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యానికి సంగీత దర్శకుడు మహా వీర్ యేలెంధర్ స్వరాలు సమకూర్చగా, సాయి చరణ్ తన శక్తివంతమైన గొంతుతో ఆలపించారు.

క్రిష్ జాగర్లమూడి ప్రశంసలు

ధర్మో రక్షతి రక్షితః పాటలోని ప్రతీ పదం సమాజంలో ధర్మం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఉందని క్రిష్ జాగర్లమూడి కొనియాడారు. సినిమా మంచి విజయం సాధించాలని ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

మా ప్రతి అడుగులో చంద్రబోస్ గారి ప్రోత్సాహం

ధర్మో రక్షతి రక్షితః పాట విడుదల సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. "మా సినిమా నుంచి అత్యంత కీలకమైన పాటను స్టార్ డైరెక్టర్ క్రిష్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు మా ప్రతి అడుగులో వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహం మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెలిపారు.

కంటెంట్‌ను నమ్ముకుని తీసిన సినిమా

'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రంలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు, సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, కస్తూరి, హారిక, 'కాలకేయ' ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, శివకుమార్ రామచంద్రవారపు, ఐ డ్రీమ్ అంజలి, సత్యప్రకాశ్, నటరాజ, రాయంచ కొక్కుర తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు.

పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా

పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాంకేతిక విభాగంలో వెంకట హనుమ ఛాయాగ్రహణం అందించగా, అస్లాం మాటలు రాశారు. నందు మాస్టర్ ఫైట్స్ సమకూర్చగా, సాయిబాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

త్వరలో గ్రాండ్ రిలీజ్

భార్గవచారి నౌండ్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి బి. వీరబాబు పి.ఆర్.ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న ధర్మస్థల నియోజకవర్గం చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe