తెలుగు వెండితెరపై ఫీచర్ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇస్తున్న ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ. ఆమె తెరకెక్కించిన తొలి సినిమా రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. అనుదీప్ సంగీతం అందించారు.
రాకాస ట్రైలర్ విడుదల

రాకాస సినిమాలో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశాడు. సంగీత్ శోభన్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నయన్ సారిక యాక్ట్ చేసింది. గెటప్ శ్రీను కీలక పాత్ర పోషించాడు. ఏప్రిల్ 3న రాకాస సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రాకాస ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
రాకాస ట్రైలర్ తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాకాస డైరెక్టర్ మానస శర్మ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నయన్ సారిక గురించి, రాకాస బడ్జెట్, తదిదర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మానస శర్మ.
నయన్ సారిక గురించి చెప్పండి?
మానస శర్మ : నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.
బడ్జెట్ పెరిగిందని అంటున్నారు? దాని గురించి చెప్పండి?
మానస శర్మ : ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.
‘రాకాస’లో కొత్తగా ఏం ఉండబోతోంది?
{{/usCountry}}మానస శర్మ : ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.
‘రాకాస’లో కొత్తగా ఏం ఉండబోతోంది?
{{/usCountry}}మానస శర్మ : ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.
వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం కాలేదా?
మానస శర్మ : ‘రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది.
అనుదీప్ గారి మ్యూజిక్ గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారిక గారు అనుదీప్ గారిని సజెస్ట్ చేశారు. అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్ఆర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం.
నిర్మాత నిహారిక గారి గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారిక గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక గారు మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
మానస శర్మ : ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తరువాత వాటి గురించి చెబుతాను.