...
...
Next Story

ది రాజా సాబ్‌లో ఆయనది కథను మలుపు తిప్పే పాత్ర- ఆ 15 నిమిషాలు మ్యాజిక్కే: దర్శకుడు మారుతి- ప్రభాస్, సంజయ్ దత్ కాదు!

ప్రభాస్ నటించిన కామెడీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ గురించి దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 3, 2026, 11:29:18 IST
Advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. కొత్త తరహా హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.

డైరెక్టర్ మారుతి కామెంట్స్

ది రాజా సాబ్‌లో ఆయనది కథను మలుపు తిప్పే పాత్ర- ఆ 15 నిమిషాలు మ్యాజిక్కే: దర్శకుడు మారుతి- ప్రభాస్, సంజయ్ దత్ కాదు!
ది రాజా సాబ్‌లో ఆయనది కథను మలుపు తిప్పే పాత్ర- ఆ 15 నిమిషాలు మ్యాజిక్కే: దర్శకుడు మారుతి- ప్రభాస్, సంజయ్ దత్ కాదు!

ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ దర్శకుడు మారుతి తాజాగా సినిమాలోని ఒక కీలక పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ వెండితెరపై విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచిన బొమన్ ఇరానీ ది రాజా సాబ్‌లో సైకియాట్రిస్ట్ (మనోవైద్యుడు) పాత్రలో కనిపించనున్నారు.

కథను మలుపు తిప్పే పాత్ర

బొమన్ ఇరానీ పాత్ర గురించి మారుతి మాట్లాడుతూ.. "ది రాజా సాబ్ సినిమాలో బొమన్ ఇరానీ పాత్ర ఎంతో కీలకం. ట్రైలర్‌లో చూసినట్లుగా ఆయన మేకోవర్ చాలా కొత్తగా ఉంటుంది. కథలో ఆయన పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా టోన్ ఒక్కసారిగా మారిపోతుంది. హారర్ కామెడీ నుంచి ప్రేక్షకులు ఊహించని ఒక కొత్త మలుపు వైపుకు కథ వెళ్తుంది" అని వివరించారు.

భాషా బేధం లేకుండా పరకాయ ప్రవేశం

బొమన్ ఇరానీ నటనను మారుతి ఆకాశానికెత్తారు. "కథ విన్న వెంటనే ఆయన ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తన డైలాగులను తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఎంతో అద్భుతంగా పలికారు. ఈ సినిమాలో ఆయన నిడివి కేవలం 15 నుంచి 16 నిమిషాలు మాత్రమే ఉండొచ్చు. కానీ, ఆ ఉన్నంతసేపు ప్రేక్షకులు ఆయన నటన మాయాజాలానికి మంత్రముగ్ధులు కావడం ఖాయం. నేను చెప్పడం కంటే మీకు చూస్తే తెలుస్తుంది" అని డైరెక్టర్ మారుతి పేర్కొన్నారు.

సంక్రాంతి రేసులో రాజా సాబ్

ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారినప్పటికీ చివరకు ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పలు భారీ తెలుగు, తమిళ చిత్రాలతో పోటీ పడనుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా చేయగా సంజయ్ దత్ విలన్‌గా నటించాడు.

అభిమానుల ఎదురుచూపులు

హారర్, కామెడీ అంశాలను మేళవించి మారుతి ఈ చిత్రాన్ని ఎలా మలిచారో, ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో ఎలా చూపించారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks