రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెలుగులో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ మరువ తరమా. ఈ సినిమాలో హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల ప్రధాన పాత్రలు పోషించారు. మరువ తరమా సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే చైతన్య వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
మరువ తరువ నిర్మాతలు

మరువ తరమా చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా నిర్మించారు. నవంబర్ 28న థియేటర్లలో మరువ తరమా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రిలీజ్ చేసిన ప్రమోషనల కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.
మూడు పాత్రల చుట్టూ
తాజాగా మరువ తరమ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మరువ తరమా ట్రైలర్ స్వచ్ఛమైన లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా మూడు పాత్రల చుట్టూ సాగుతుందని అర్థమవుతోంది. అయితే, మరువ తరమా ట్రైలర్‌ను చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు.
రాహుల్ రవీంద్రన్ రివ్యూ
అంతేకాకుండా మరువ తరమా ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ కూడా ఇచ్చారు. మరువ తరమా ట్రైలర్‌ను తాను చూశానని, లవ్‌లీ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్‌తోపాటు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోందని హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెలిపారు. మరువ తరమా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు రాహుల్ రవీంద్రన్.
హైలెట్‌గా బీజీఎమ్
డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లిని సపోర్ట్ చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఇకపోతే మరువ తరమా ట్రైలర్‌లో విజయ్ బుల్గానిన్ బీజీఎమ్ హైలెట్‌గా నిలిచింది. లవ్ స్టోరీ చూస్తే రొటీన్‌గా అనిపించిన సంగీతం మాత్రం చాలా మంచి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది.
చాలా కవితాత్మకంగా
మరువ తరమా ట్రైలర్ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాగే లవ్ ట్రాక్‌ను చాలా పొయెటిక్‌గా చూపించారు. వర్షం, ప్రకృతి, వాటి మధ్యలో ప్రేమజంటతో మంచి అనుభూతిని ఇచ్చింది.
అదిరిపోయిన డైలాగ్
{{/usCountry}}మరువ తరమా ట్రైలర్ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాగే లవ్ ట్రాక్‌ను చాలా పొయెటిక్‌గా చూపించారు. వర్షం, ప్రకృతి, వాటి మధ్యలో ప్రేమజంటతో మంచి అనుభూతిని ఇచ్చింది.
అదిరిపోయిన డైలాగ్
{{/usCountry}}ప్రేమ రెండు అక్షరాల చిన్న మాట. పలకడానికి సులువుగానే ఉంటుంది. కానీ, దాంతో పడాలంటేనే చాలా కష్టం అని హీరోయిన్ చెప్పే డైలాగ్ డెప్త్ చూపిస్తూ హైలెట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ, విజివల్స్ బాగున్నాయి. మ్యాజిక్‌తో మ్యాజిక్ చేసేలా ఎమోషనల్ లవ్ స్టోరీగా మరువ తరమా సినిమాను డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో
కాగా, నవంబర్ 28న మరువ తరమా మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుండగా.. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇటీవల రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.