Siddharth Anand On Shahrukh Deepika Leak Photos: ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో 'కింగ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా పాల్గొంటున్నారు. అయితే, సెట్స్ నుంచి వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్ట్రైప్డ్ వైట్ అండ్ బ్లూ షర్ట్‌లో షారుఖ్ ఖాన్ క్లాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆరెంజ్ కలర్ దుస్తుల్లో దీపికా మెరిసిపోతున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా షూటింగ్‌లో పాల్గొనడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేయడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.
సర్‌ప్రైజ్ పాడు చేయకండి
లీకైన షారుఖ్, దీపికా ఫొటోలపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "అభిమానులందరికీ ఒక విన్నపం.. 'కింగ్' సెట్స్ నుంచి లీకైన ఫోటోలను, వీడియోలను దయచేసి షేర్ చేయకండి. మీ అందరికీ వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి మా బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఆ సర్‌ప్రైజ్‌ను సినిమా హాల్‌లోనే చూసి ఆస్వాదించండి. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రచార చిత్రాలను విడుదల చేసే వరకు వేచి ఉండండి" అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డైరెక్టర్ సిద్ధాంత్ ఆనంద్ కోరారు.
తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబినేషన్
కింగ్ సినిమా టీమ్ కష్టాన్ని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటమే.
ఈ యాక్షన్ డ్రామాలో షారుఖ్ ఒక పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్‌గా, సుహానా ఆయన శిష్యురాలిగా కనిపిస్తారని సమాచారం. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ కింగ్ సినిమాను నిర్మిస్తున్నాయి.
భారీ తారాగణం.. క్రిస్మస్ కానుక
{{/usCountry}}ఈ యాక్షన్ డ్రామాలో షారుఖ్ ఒక పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్‌గా, సుహానా ఆయన శిష్యురాలిగా కనిపిస్తారని సమాచారం. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ కింగ్ సినిమాను నిర్మిస్తున్నాయి.
భారీ తారాగణం.. క్రిస్మస్ కానుక
{{/usCountry}}సిద్ధార్థ్ ఆనంద్ తనదైన స్టైల్‌లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, అర్షద్ వార్సీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కింగ్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లీకుల గొడవ పక్కన పెడితే, షారుఖ్ - దీపికా కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కింగ్' సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్ నటిస్తున్నారా?
అవును, ఈ సినిమా ద్వారా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు.
2. షూటింగ్ ఫోటోల లీక్‌పై దర్శకుడు ఏమన్నారు?
సినిమాలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ దెబ్బతినకుండా ఉండేందుకు, లీకైన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అభిమానులను కోరారు.
3. 'కింగ్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
4. ఈ సినిమాలో దీపికా పదుకొణె పాత్ర ఏమిటి?
దీపికా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజా కేప్ టౌన్ షెడ్యూల్‌లో ఆమె షారుఖ్‌తో కలిసి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు.