ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్నఓటీటీ సంస్థల్లో జీ5 ఒకటి. ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా అవతరిస్తోన్న జీ 5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది.
సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్

అదే ‘నయనం’. హీరో వరుణ్ సందేశ్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నయనం ఓటీటీ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు.
నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఈ ఒరిజినల్ సిరీస్ నయనం జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ స్వాతి ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ ప్లేస్ ఓ డ్రీమ్
డైరెక్టర్ స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ.. "అనూరాధ గారికి, జీ5కి ముందు థాంక్స్. ప్రతి డెబ్యూ డైరెక్టర్‌కి ఈ ప్లేస్ ఓ డ్రీమ్. నా డ్రీమ్‌ను నిజం చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. షోయబ్ నా డ్రీమ్‌ను విజువల్‌గా చూశారు. అజయ్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చి ఎన్‌హెన్స్ చేశారు" అని అన్నారు.
పక్కవారి లైఫ్‌లో
"ఈ పాయింట్‌ను ముందు నమ్మింది సాయి తేజ గారు. నాతో పాటు ట్రావెల్ అవుతూ ఓ షేప్ తీసుకొచ్చారు. ఆయనకు థాంక్స్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన కిరణ్మయి గారికి థాంక్స్. పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్‌లో ఏం జరుగుతందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ ఓటీటీ సిరీస్" అని దర్శకురాలు స్వాత ప్రకాష్ తెలిపారు.
ప్లానింగ్ ప్రకారం
{{/usCountry}}"ఈ పాయింట్‌ను ముందు నమ్మింది సాయి తేజ గారు. నాతో పాటు ట్రావెల్ అవుతూ ఓ షేప్ తీసుకొచ్చారు. ఆయనకు థాంక్స్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన కిరణ్మయి గారికి థాంక్స్. పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్‌లో ఏం జరుగుతందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ ఓటీటీ సిరీస్" అని దర్శకురాలు స్వాత ప్రకాష్ తెలిపారు.
ప్లానింగ్ ప్రకారం
{{/usCountry}}"సాధిక గారికి స్పెషల్ థాంక్స్. సాగర్ గారు ప్లానింగ్ ప్రకారం సపోర్ట్ చేశారు. రజినీ మేడమ్ గారు డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి చాన్స్ ఇచ్చారు. కథ విని ఒప్పుకున్న వరుణ్ సందేశ్ గారికి థాంక్స్" అని స్వాత ప్రకాష్ పేర్కొన్నారు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
"మా కష్టానికి యూనివర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్న నయనం సిరీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని చూడండి" అని నయనం ఓటీటీ సిరీస్ డైరెక్టర్ స్వాతి ప్రకాష్ చెప్పుకొచ్చారు.
జర్నీలో భాగం కావడం
ఇదే ఈవెంట్‌లో సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ మాట్లాడుతూ.. "ఈ జర్నీలో భాగం కావటానికి ఎస్ఆర్‌టీ టీమ్, సాధిక, స్వాతి గారు అందరూ ఎంతో హెల్ప్ చేశారు. విజువల్స్ మెప్పిస్తాయి. డిసెంబర్ 19న నయనం మెప్పిస్తుంది" అని అన్నారు.
బ్యూటిఫుల్‌గా జరుగుతుంది
అలాగే, ఎడిటర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో నన్ను పార్ట్ చేసిన సాధికకు థాంక్స్. ప్రాజెక్ట్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.