...
...
Next Story

OTT Actress: నేను ఎవరికీ సపోర్టింగ్ కాదు, నాకు నేనే సపోర్ట్- అలాంటి ట్యాగ్‌పై ఓటీటీ నటి దివ్య దత్తా షాకింగ్ కామెంట్స్

Divya Dutta On Supporting Actor Tag: నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్య దత్తా సినిమా పరిశ్రమలో ఇచ్చే 'సపోర్టింగ్ యాక్టర్' అనే ట్యాగ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం హీరోతో రొమాన్స్ చేయనంత మాత్రాన తక్కువ చేసి చూడటం సరికాదని ఓటీటీ నటి దివ్య దత్తా స్పష్టం చేశారు.

Published on: Mar 15, 2026, 22:13:04 IST
Advertisement

బాలీవుడ్ వెండితెరపై తన అద్భుత నటనతో ఎన్నో మరపురాని పాత్రలకు ప్రాణం పోసిన నటి దివ్య దత్తా. అయితే, దశాబ్దాల కాలంగా పరిశ్రమలో నటీనటులకు అంటగడుతున్న కొన్ని 'లేబుల్స్' పట్ల ఆమె ఇప్పుడు తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా 'సపోర్టింగ్ యాక్టర్' (సహ నటులు) అనే పిలుపు తనకు అస్సలు నచ్చదని ఆమె తెగేసి చెప్పారు.

కేవలం నటిని మాత్రమే!

నేను ఎవరికీ సపోర్టింగ్ కాదు, నాకు నేనే సపోర్ట్- అలాంటి ట్యాగ్‌పై ఓటీటీ నటి దివ్య దత్తా షాకింగ్ కామెంట్స్
నేను ఎవరికీ సపోర్టింగ్ కాదు, నాకు నేనే సపోర్ట్- అలాంటి ట్యాగ్‌పై ఓటీటీ నటి దివ్య దత్తా షాకింగ్ కామెంట్స్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓటీటీ నటి దివ్య దత్తా తన కెరీర్ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఒక నటిని, నన్ను అలాగే పిలవాలని కోరుకుంటున్నాను" అని దివ్య దత్తా అన్నారు.

"కొన్ని ఏళ్ల క్రితం వరకు నటీనటులను కేవలం లీడ్, సపోర్టింగ్ అని వర్గీకరించడం వింతగా అనిపించేది. ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలు చేయడానికే కాదు.. ప్రాధాన్యత ఉన్న ప్రతి పాత్రలోనూ మెరవాలని నేను అనుకుంటాను" అని దివ్య దత్తా పేర్కొన్నారు.

నాకు నేనే సపోర్ట్

సినిమాలో కేవలం హీరో చుట్టూ తిరిగే పాత్రలు చేయనంత మాత్రాన ఆమె 'సపోర్టింగ్ క్యారెక్టర్' ఎలా అవుతుందని దివ్య ప్రశ్నించారు. "నేను ఇక్కడ ఎవరికీ సపోర్ట్ చేయడానికి రాలేదు. నాకు నేనే సపోర్ట్. అది విలన్ పాత్ర అయినా, కామెడీ అయినా లేదా ఒక చిన్న నిడివి ఉన్న పాత్ర అయినా.. అది కథను మలుపు తిప్పేదిగా ఉండాలని నేను కోరుకుంటాను. నా ఫిల్మోగ్రఫీ చూస్తే.. ప్రతి సినిమాలోనూ నా పాత్ర ఎంతో కీలకమైనదిగా కనిపిస్తుంది" అని దివ్య దత్తా గర్వంగా చెప్పారు.

ఆ ట్యాగ్ వేయించుకోవడం ఇష్టం లేదు..

కాగా, 1994లో ‘ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన దివ్య దత్తా వీరజారా, భాగ్ మిల్కా భాగ్, ఢిల్లీ-6, బద్లాపూర్ వంటి చిత్రాలతో తన నటనలోని వైవిధ్యతను నిరూపించుకున్నారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

దివ్య దత్తా తన తదుపరి ప్రాజెక్టుగా 'చిరయ్యా' అనే పవర్‌ఫుల్ సోషల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్చి 20న జియో హాట్‌స్టార్ (JioHotstar)లో చిరయ్యా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ ఓటీటీ సిరీస్ భారతదేశంలో 'మారిటల్ రేప్' (వైవాహిక అత్యాచారం) అనే సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది.

ఆరు ఎపిసోడ్స్‌తో ఓటీటీ సిరీస్

శశాంత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ చిరయ్యా ఆరు ఎపిసోడ్లుగా రానుంది. ఈ సిరీస్‌లో కమలేష్ అనే ఇల్లాలు పాత్రలో దివ్య దత్తా నటించారు. తన కుటుంబ గౌరవానికి, తన తోడికోడలు ఎదుర్కొంటున్న వేధింపులకు మధ్య నలిగిపోయే ఒక మహిళ పోరాటాన్ని ఈ సిరీస్‌లో చూడవచ్చు. ఇందులో సంజయ్ మిశ్రా కూడా కీలక పాత్ర పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks