Drishyam 3 Vs Sigma Box Office Collection Day 1: గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రెండు భిన్నమైన సినిమాలు పోటీపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' థియేటర్లలోకి రాగా, మరోవైపు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి రోజు వసూళ్ల విషయంలో 'దృశ్యం 3' ఊహించని రీతిలో రికార్డులను తిరగరాయగా, 'సిగ్మా' పరిమిత వసూళ్లతో బోణీ కొట్టింది. విజయ్ సాల్గాంకర్ కుటుంబ కథను నమ్ముకుని వచ్చిన 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సునామీ సృష్టించింది.
'దృశ్యం 3' వసూళ్ల సునామీ.. అజయ్ దేవగన్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్!
ప్రముఖ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా దృశ్యం 3 చిత్రం తొలిరోజే రూ. 66.75 కోట్ల నికర వసూళ్లను (Net) రాబట్టింది. భారతీయ మార్కెట్‌లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూ. 80.10 కోట్లుగా నమోదు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ. 15 కోట్ల గ్రాస్ వచ్చింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే దృశ్యం 3 సినిమా రూ. 95.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డులు తిరగరాసింది. దేశవ్యాప్తంగా ఏకంగా 15,759 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా హిందీ 2D వెర్షన్‌లో 67.08 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది.
76.46 శాతం ఆక్యుపెన్సీ
ఉదయం షోల కంటే కూడా రాత్రి ప్రదర్శనలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో నైట్ షోలలో 76.46 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అజయ్ దేవగన్ సుదీర్ఘ సినీ ప్రస్థానంలోనే ఇది అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో 'సింగం ఎగైన్' సాధించిన రూ. 43.70 కోట్ల రికార్డును ఈ సినిమా తిరగరాసింది.
2015లో వచ్చిన 'దృశ్యం పార్ట్ 1' తొలిరోజు రూ. 5.85 కోట్లు, 2022లో వచ్చిన 'దృశ్యం 2' తొలిరోజు రూ. 15.38 కోట్లు వసూలు చేయగా, మూడో భాగం ఏకంగా రూ. 66.75 కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు.
దళపతి విజయ్ కొడుకు 'సిగ్మా' బోణీ ఎలా ఉందంటే?
{{/usCountry}}2015లో వచ్చిన 'దృశ్యం పార్ట్ 1' తొలిరోజు రూ. 5.85 కోట్లు, 2022లో వచ్చిన 'దృశ్యం 2' తొలిరోజు రూ. 15.38 కోట్లు వసూలు చేయగా, మూడో భాగం ఏకంగా రూ. 66.75 కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు.
దళపతి విజయ్ కొడుకు 'సిగ్మా' బోణీ ఎలా ఉందంటే?
{{/usCountry}}తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'సిగ్మా'. తెలుగు హీరో సందీప్ కిషన్, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజే రూ. 2.35 కోట్ల నికర వసూళ్లను (Net) సాధించింది. భారత్‌లో మొత్తం రూ. 2.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా 1,813 షోలలో విడుదలై రూ. 2.21 లక్షలకు పైగా ఫుట్‌ఫాల్స్ సాధించిన సిగ్మా సినిమా 31.1 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. తమిళ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ. 1.50 కోట్ల నికర వసూళ్లు రాగా, తెలుగు వెర్షన్ రూ. 85 లక్షలు రాబట్టింది.
రాష్ట్రాల వారీగా చూస్తే
రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు నుంచి సిగ్మా సినిమాకు రూ. 1.30 కోట్ల గ్రాస్ రాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి రూ. 1.00 కోట్ల గ్రాస్ నమోదు చేశాయి. కర్ణాటక నుంచి రూ. 25 లక్షలు, కేరళ నుంచి రూ. 12 లక్షలు లభించాయి.
| Film | India net Day 1 | India gross Day 1 | Shows | Opening-day occupancy |
|---|---|---|---|---|
| Drishyam 3: The Conclusion | ₹66.75 crore | ₹80.10 crore | 15,759 | 67.08% |
| Sigma | ₹2.35 crore | ₹2.70 crore | 1,813 | 31.1% |
బాక్సాఫీస్ స్కేల్ తేడా చూపిస్తున్న లెక్కలు
15,759 షోలతో భారీ స్థాయిలో దిగిన 'దృశ్యం 3' పాన్-ఇండియా రేంజ్‌లో హవా చూపిస్తుంటే, 1,813 షోలతో చిన్న స్థాయిలోనే ఆరంభమైన 'సిగ్మా' నెమ్మదిగా వారాంతంలో పుంజుకోవాలని చూస్తోంది. క్రైమ్ థ్రిల్లర్లని ఇష్టపడే ప్రేక్షకులు విజయ్ సాల్గాంకర్ సస్పెన్స్‌కు ఫిదా అవుతుండటంతో రాబోయే రోజుల్లో 'దృశ్యం 3' రూ. 200 కోట్ల వైపు వేగంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.