...
...
Next Story

ఓటీటీకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- లేడీ డాన్‌గా యాంకర్ ఝాన్సీ- గ్లోబ్ ట్రాటర్ కాదు గ్లోబ్ టార్చర్ అంటూ స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఇవాళ తెలుగు రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ఇగో స్ట్రీమింగ్‌కు వచ్చింది. యాంకర్ ఝాన్సీ లేడి డాన్‌గా నటించిన ఇగో ట్రైలర్‌లో ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ కాదు గ్లోబ్ టార్చర్ అంటూ చూపించారు. రివేంజ్ తీసుకునేందుకు అమెరికా వెళ్లే కాన్సెప్ట్‌తో వచ్చిన ఇగో ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 16, 2025, 19:07:58 IST
Advertisement

ఓటీటీలోకి ఇటీవల తెలుగు కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా అచ్చ తెలుగు భాషతో స్వచ్ఛమైన కథలను అందిస్తున్నారు. ఇక ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ప్రతి ఆదివారం ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతుంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రం

ఓటీటీకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- లేడీ డాన్‌గా యాంకర్ ఝాన్సీ- గ్లోబ్ ట్రాటర్ కాదు గ్లోబ్ టార్చర్ అంటూ స్ట్రీమింగ్
ఓటీటీకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- లేడీ డాన్‌గా యాంకర్ ఝాన్సీ- గ్లోబ్ ట్రాటర్ కాదు గ్లోబ్ టార్చర్ అంటూ స్ట్రీమింగ్

అలా ఇవాళ (నవంబర్ 16) ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమా ఇగో (Ego Movie OTT). విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రంగా ఇగో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ లేడి డాన్‌గా కనిపించింది. అలాగే, మ్యాడ్, శుభం సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న చరణ్ పెరి స్కూల్ టీచర్‌గా చేశాడు.

ఇగో నటీనటులు

ఈ ఇద్దరితోపాటు ఇగో సినిమాలో భాను తేజ్ కదిమిసెట్టి, అశోక్ సీపల్లి, అసురఖాళీ పవన్, ఆషిష్ కెన్నెడి, సూర్య గౌడ్, అజయిల్పి కిస్కింద, షేక్ ముఖ్తర్ అహ్మద్, సాయి కదిర, భాను ప్రకాష్ అమాస, సూర్య భరద్వాజ్, ఏ సంధ్య, బైరిసెట్టి ప్రియాంక ఇతర పాత్రలు పోషించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్

ఇగో చిత్రానికి యోహిత్ రెడ్డి కథ, దర్శకత్వం వహించారు. ఉదయ సద్దాల నిర్మాతగా వ్యవహరించారు. బీఎన్ ఆదిత్య సంగీతం అందించిన ఇగో చిత్రానికి నాగేశ్వర్ వడ్డే సినిమాటోగ్రఫీ, సుశ్రుత్ చిలకపాటి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

శత్రువును చంపేందుకు అమెరికాకు

ఇక కథ విషయానికొస్తే ఇగో సినిమాలో సారక్క (ఝాన్సీ) అనే లేడి డాన్ ఉంటుంది. ఆమె తన శత్రువుపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే ఆ శత్రువు అమెరికాలో ఉంటాడని ఓరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటుంది. దాంతో అమెరికాకే వెళ్లి శత్రువును చంపాలనుకుంటుంది.

పగ తీర్చుకుందా

ఇవాళ (నవంబర్ 16) ఇగో ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్‌లో నేటి నుంచి ఇగో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈటీవీ విన్ ఓటీటీ ప్రతివారం కథా సుధా అనే వీక్లి సిరీస్ నుంచి సరికొత్త సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈటీవీ విన్ కథా సుధా

అందులో భాగంగానే ఈ ఆదివారం ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా ఇగో ఓటీటీ రిలీజ్ అయింది. ఇక ఇగో ట్రైలర్‌లో ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ కాదు గ్లోబ్ టార్చర్ అంటూ చూపించారు. కేవలం 39 నిమిషాల 18 సెకన్ల రన్‌టైమ్ ఉన్న ఇగోను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe