...
...
Next Story

Ek Din: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి షాక్.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ జునైద్ ఖాన్ ఏక్ దిన్.. 2 డేస్ కలెక్షన్స్ ఇంతే!

Sai Pallavi Ek Din 2 Days Box Office Collection: సాయి పల్లవి ఎంతో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఏక్ దిన్‌కు బాక్సాఫీస్ వద్ద షాక్ తగిలింది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఏక్ దిన్ భారీ అంచనాల మధ్య విడుదలై రెండో రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

Published on: May 3, 2026, 11:00:24 IST
Advertisement

Sai Pallavi Ek Din Box Office Collection Day 2: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం ‘ఏక్ దిన్’. శుక్రవారం (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిశ్రమ స్పందన లభించింది. విమర్శకుల నుంచి ప్రతికూల రివ్యూలు రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి షాక్.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ జునైద్ ఖాన్ ఏక్ దిన్.. 2 డేస్ కలెక్షన్స్ ఇంతే!
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి షాక్.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ జునైద్ ఖాన్ ఏక్ దిన్.. 2 డేస్ కలెక్షన్స్ ఇంతే!

సాధారణంగా శనివారం నాడు వసూళ్లలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చిన ఏక్ దిన్ సినిమా విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెండో రోజు కూడా కలెక్షన్లు ఫ్లాట్‌గా ఉండటం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

కలెక్షన్ల లెక్కలు ఇవే..

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, రెండో రోజు ఏక్ దిన్ చిత్రం కేవలం ఒక కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. మొదటి రోజు సాధించిన రూ. 1.15 కోట్లతో పోలిస్తే ఇది కొంత తగ్గుదలనే చెప్పాలి. రెండు రోజులు కలిపి భారత బాక్సాఫీస్ వద్ద ఏక్ దిన్ సినిమా సుమారు 2.15 కోట్ల రూపాయల నికర వసూళ్లను (Net), 2.57 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

అయితే, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ‘రాజా శివాజీ’, అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం కూడా ‘ఏక్ దిన్’ పతనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి షాక్ తగిలినట్లుగా హిందీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రీమేక్ కథ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి?

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌పై అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవికి ఇది తొలి హిందీ సినిమా కావడంతో దక్షిణాది ప్రేక్షకులు సైతం ఈ చిత్రంపై ఆసక్తి చూపారు.

సాయి పల్లవి ఏమన్నారంటే..?

ఇదిలా ఉంటే, ఏక్ దిన్ సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి తన ఆవేదనను, ఆనందాన్ని పంచుకున్నారు. "నా ప్రయాణం ఇంతటి ప్రతిభావంతుల మధ్యకు చేరినందుకు సంతోషంగా ఉంది. అమీర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని సాయి పల్లవి చెప్పారు.

"హిందీలో ఇది నా మొదటి సినిమా కావడంతో చాలా కంగారుగా ఉంది. కానీ, ఈ ప్రయాణం మాత్రం చాలా అందంగా సాగింది. జునైద్ ఒక మంచి కో-స్టార్ మాత్రమే కాదు, చాలా విధేయత కలిగిన వ్యక్తి" అని సాయి పల్లవి పేర్కొన్నారు. మరి ఆదివారం అంటే ఇవాళ్టీ (మే 3) ఏక్ దిన్ కలెక్షన్స్ అయిన పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe