ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులతో అంతర్జాతీయ విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
అబుదాబిలో చిక్కుకుపోయిన హీరోయిన్

ఈ భయానక పరిస్థితుల నడుమ అబుదాబిలో చిక్కుకుపోయిన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఎట్టకేలకు మార్చి 2న ఢిల్లీ చేరుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేరిన తర్వాత, గడిచిన ఆ మూడు రోజుల్లో తను అనుభవించిన నరకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఏం జరుగుతుందో తెలియని అయోమయం!
"ఫిబ్రవరి 28వ తేదీన నేను విమానాశ్రయానికి చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఎయిర్‌పోర్టును మూసివేశారు. చుట్టూ అంతా గందరగోళం.. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు" అని ఈషా గుప్తా తెలిపారు.
"కాసేపటికే క్షిపణి దాడుల వార్తలు రావడం మొదలైంది. తర్వాతి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి. గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒకరినొకరు ఓదార్చుకుంటూ, తమ కుటుంబ సభ్యులకు ఫోన్లలో మాట్లాడుకుంటూ భయం భయంగా గడిపారు" అని ఈషా గుప్తా అబుదాబిలో చిక్కుకున్న పరిస్థితులను వివరించారు.
యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు
అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఈషా గుప్తా కొనియాడారు. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా భోజన వసతులు, హోటల్ రూమ్‌లు ఏర్పాటు చేసిందని తెలిపారు.
భయం ఉన్నా కూడా
"నేను చెక్-ఇన్ కాకపోవడంతో వెంటనే వెనక్కి తిరిగి అబుదాబిలోని హోటల్‌కు చేరుకున్నాను. అక్కడ స్టాఫ్ ముఖాల్లో భయం ఉన్నా.. ఎక్కడా కూడా ప్రయాణికులకు ఒత్తిడి కలగకుండా అద్భుతంగా పనిచేశారు" అని ఈషా గుప్తా పేర్కొన్నారు.
భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు
అదృష్టవశాత్తూ ఇతిహాద్ ఎయిర్‌వేస్ నడిపిన మొదటి కమర్షియల్ ఫ్లైట్‌లోనే ఈషా గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. తనను సురక్షితంగా రప్పించేందుకు కృషి చేసిన భారత ప్రభుత్వానికి, యూఏఈ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ 'రాధే రాధే' అంటూ తన నోట్‌ను ముగించారు.
యుద్ధం ముదురుతోంది.. విమానాలు రద్దు!
గత వారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించడంతో పరిస్థితులు విషమించాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో యూఏఈ, దోహాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో గల్ఫ్ దేశాల విమాన మార్గాలను మూసివేశారు.
{{/usCountry}}గత వారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించడంతో పరిస్థితులు విషమించాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో యూఏఈ, దోహాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో గల్ఫ్ దేశాల విమాన మార్గాలను మూసివేశారు.
{{/usCountry}}ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం పరిమితంగా కొన్ని ప్రత్యేక విమానాలను నడుపుతున్నప్పటికీ, ప్రయాణికులు ఎయిర్‌లైన్ నుంచి అధికారిక సమాచారం వస్తేనే విమానాశ్రయానికి రావాలని అధికారులు సూచించారు.
మంచు విష్ణు, అజిత్ పరిస్థితి ఏంటీ?
కాగా, ఈషా గుప్తాతో పాటు దుబాయ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, మంచు విష్ణు, సోనాల్ చౌహన్, నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా చిక్కుకుపోయారు. ఈషా గుప్తా భారత్‌కు చేరుకున్న వేళ మంచు విష్ణు, అజిత్, పీవీ సింధు, సోనాల్, నర్గీస్‌ల పరిస్థితి ఏమై ఉంటుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
క్షేమంగానే
అయితే, ఈపాటికే తాను క్షేమంగానే ఉన్నట్లు మంచు విష్ణు తెలిపిన విషయం తెలిసిందే. దుబాయిలో ఇరుక్కున్నప్పటికీ మంచు విష్ణు, అజిత్, సోనాల్, సింధు, నర్గీస్, సోనాల్ వంటి స్టార్స్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.