Top 3 OTT Trending Today: ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబగళ్లు కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాల చుట్టూ ఇప్పడు ఓటీటీ వినోద రంగం దృష్టి సారించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల లీకేజీలు ఎంతటి సంచలనం సృష్టించాయో చూశాం.
సోషల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

సరిగ్గా ఇలాంటి సామాజికాంశాన్ని నమ్ముకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక హై-వోల్టేజ్ సోషల్-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్'. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎ. సర్గుణం పర్యవేక్షణలో రూపొందిన ఎగ్జామ్ తమిళ ఒరిజినల్ ఓటీటీ సిరీస్.
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసే స్కామ్ కథాంశంతో..
ఈ ఓటీటీ సిరీస్ ఎగ్జామ్ కథ మొత్తం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. రహస్యమైన గతాన్ని దాచుకున్న ఆ యువతి, ప్రాంతీయ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ (గ్రూప్స్ పరీక్షలు) పేపర్ లీకేజీలకు పాల్పడే ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది.
పరీక్ష వ్యవస్థను శాసిస్తున్న ముఠా
అమాయక విద్యార్థులను దోపిడీ చేస్తూ, పరీక్షా వ్యవస్థను శాసిస్తున్న ఆ ముఠా గుట్టును ఆమె ఎలా రట్టు చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ప్రాణసంకట పరిస్థితులు ఏంటి? అనే అంశాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అనుభవించే మానసిక ఒత్తిడిని, నెట్‌వర్క్ మోసాలను ఇందులో కళ్లకు కట్టారు.
స్టార్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్
వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకునే దుషారా విజయన్ ఈ ఎగ్జామ్ ఓటీటీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించగా.. సీనియర్ హీరో అబ్బాస్, పాపులర్ నటి అదితి బాలన్ కీలక పాత్రల్లో నటించారు. వసుంధర కశ్యప్, నరేన్ మణి సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశారు. విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకులు పుష్కర్ - గాయత్రి తమ 'వాల్వాచర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యున్నత నిర్మాణ విలువల ప్రొడ్యూస్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
{{/usCountry}}వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకునే దుషారా విజయన్ ఈ ఎగ్జామ్ ఓటీటీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించగా.. సీనియర్ హీరో అబ్బాస్, పాపులర్ నటి అదితి బాలన్ కీలక పాత్రల్లో నటించారు. వసుంధర కశ్యప్, నరేన్ మణి సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశారు. విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకులు పుష్కర్ - గాయత్రి తమ 'వాల్వాచర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యున్నత నిర్మాణ విలువల ప్రొడ్యూస్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
{{/usCountry}}ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఎగ్జామ్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 15 నుంచి ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటుగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఎగ్జామ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
టాప్ 3 ఓటీటీ ట్రెండింగ్‌లో
అయితే, ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చి దూసుకుపోతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ సిరీస్. ఇక ఇవాళ (మే 19) అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 జాబితాలో 3వ స్థానంతో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ వెబ్ సిరీస్. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.4 రేటింగ్ సొంతం చేసుకుని సత్తా చాటుతుంది ఎగ్జామ్ ఓటీటీ సిరీస్