TV Show: బుల్లితెరకు మళ్లీ వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ షో.. ఇద్దరు మరదళ్ల మధ్యలో సుధీర్.. యష్మి కౌంటర్ చూశారా?
TV Show: బుల్లితెరపై బ్లాక్ బస్టర్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ఓ టీవీ షో మళ్లీ వచ్చేస్తోంది. ఇద్దరు మరదళ్ల మధ్యలో సుడిగాలి సుధీర్ చేసే ఫన్, సెలబ్రిటీల టాస్క్ లతో ఈ షో సాగనుంది. మరి ఈ షో ఏంటీ? ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవుతుందో? ఇక్కడ చూసేయండి.
TV Show: ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షోలను అందించడంలో పాపులర్ తెలుగు ఛానెల్ ఈటీవీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఈ టీవీ ఛానెల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఎంటర్ టైన్మెంట్ షో సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఆ షోనే ‘ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2’.

ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2
ఈటీవీలో సూపర్ హిట్ గా నిలిచిన ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షో ‘ఫ్యామిలీ స్టార్స్’ నుంచి ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా ఈ సీజన్ 2 లాంఛ్ ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఇందులో మరోసారి సుడిగాలి సుధీర్ తన యాంకరింగ్ తో అదరగొట్టనున్నాడు. అతని మరదళ్లుగా స్రవంతి చొక్కారపు, అషు రెడ్డి మరోసారి సందడి చేయనున్నారు.
ఎప్పుడంటే?
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ షో జనరల్ గా మధ్యాహ్నం వచ్చేది. కానీ ఈ సీజన్ 2 టైమింగ్స్ ను మార్చారు. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఈటీవీలో వస్తుంది. సండే ప్రైమ్ టైమ్ కు ఈ షోను షిప్ట్ చేశారు. మరి సుధీర్ మ్యాజిక్ మరోసారి షోను సూపర్ హిట్ గా నిలబెడుతుందేమో చూడాలి.
లాంఛ్ ప్రోమో
ఈటీవీ తాజాగా ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లాంఛ్ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు మరదళ్లు స్రవంతి, అషుతో సుధీర్ పంచ్ లు ఎప్పటిలాగే అదిరిపోయాయి. ఇక సెలబ్రిటీలతో ఆటలు కూడా మరోసారి ఎంటర్ టైన్ చేసేలా ఉన్నాయి. ఈ లాంఛ్ ఎపిసోడ్ కు అంబటి అర్జున్, నిఖిల్, ప్రియాంక, తేజస్విని గౌడ, యష్మి తదితర సెలబ్రిటీలు వచ్చారు.
ఇక లాంఛ్ ఎపిసోడ్ కు బ్యూటీఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా సుధీర్ తో కలిసి హోస్టింగ్ కూడా చేసింది. సుధీర్ పై పంచ్ లు కూడా వేసింది.
యష్మి కౌంటర్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లాంఛ్ ఎపిసోడ్ లో యష్మి కౌంటర్లు బాగా పేలాయి. సుధీర్ దగ్గరకు వచ్చి.. ఇలా ఎవరైనా దగ్గరకు వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెప్పారా అని యష్మి అడుగుతుంది. లేదు అని సుధీర్ అంటాడు. అలా చెప్తే నమ్మకు అని యష్మి కౌంటర్ వేస్తుంది. దీంతో ఇక ప్రతి సండే రాత్రి 7.30 గంటలకు ఫ్యామిలీ స్టార్స్ తో ఎంటర్ టైన్మెంట్ పక్కా అనే కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


