ఫిబ్రవరి నెలలో ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సిరీస్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ అదిరిపోనుంది. సంక్రాంతి 2026 సినిమాలు ఈ నెలలోనే ఓటీటీలోకి వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా మరెన్నో బ్లాక్ బస్టర్లు రెడీగా ఉన్నాయి.
సంక్రాంతి సినిమాల ఓటీటీ

సంక్రాంతి 2026 సందర్భంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు, తమిళం కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో వా వాతియార్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4న ప్రైమ్ వీడియోలో, ప్రభాస్ ది రాజాసాబ్ ఫిబ్రవరి 6న జియోహాట్ స్టార్ లో, పరాశక్తి ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.
అలాగే ఈ సంక్రాంతి సినిమాలైన మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా ఈ ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి.
డెత్ విస్పరర్ 3
అతీంద్రియ దుష్ట శక్తుల నుంచి తన చెల్లెలిని కాపాడేందుకు ప్రయత్నించే ఓ అన్న స్టోరీతో వస్తున్న సిరీస్ డెత్ విస్పరర్ సీజన్ 3. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ది లింకన్ లాయర్ సీజన్ 4
మైఖేల్ కాన్నెల్లీ నవల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ది లింకన్ లాయర్ సీజన్ 4. డిఫెన్స్ న్యాయవాది లాయర్ మిక్కీ హాలర్ కార్లో డెడ్ బాడీ దొరుకుతుంది. అతను జైలు శిక్ష అనుభవిస్తాడు. కానీ నిర్దోషిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 5న రానుంది.
కొహ్రా సీజన్ 2
{{/usCountry}}మైఖేల్ కాన్నెల్లీ నవల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ది లింకన్ లాయర్ సీజన్ 4. డిఫెన్స్ న్యాయవాది లాయర్ మిక్కీ హాలర్ కార్లో డెడ్ బాడీ దొరుకుతుంది. అతను జైలు శిక్ష అనుభవిస్తాడు. కానీ నిర్దోషిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 5న రానుంది.
కొహ్రా సీజన్ 2
{{/usCountry}}ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. అత్యంత క్రూరంగా హత్యలు చేసే క్రిమినల్స్ ను పట్టుకోవడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది.
ది కంజురింగ్: లాస్ట్ రైట్స్
అత్యంత భయంకరమైన హారర్ థ్రిల్లర్లలో కంజురింగ్ ఒకటి. ఇప్పుడు ఇందులో ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సారి దుష్టశక్తిని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నించడం చుట్టూ కథ సాగుతుంది. ఇది ఫిబ్రవరి 13 నుంచి జియోహాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది.
ది బ్లఫ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సముద్రపు దొంగగా నటిస్తున్న సినిమా ది బ్లఫ్. ఇందులో ఫైట్లతో ప్రియాంక అదరగొట్టనుంది. ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది.
బ్రిడ్జర్టన్ సీజన్ 4: పార్ట్ 2
ఇది రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో ల్యూక్ థాంప్సన్, మెరీన్ హా, నికోలా తదితరులు నటించారు. ఈ సీజన్ 4లోని పార్ట్ 2 ఫిబ్రవరి 26న నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.